Samantha : దానికి సమంత పనికి రాదా.. ఇదేం ట్విస్ట్ రా బాబు..!
Samantha : దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలుగుతున్న అందాల ముద్దుగుమ్మ సమంత. ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో సామ్. ఇప్పటికే తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది . ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది సామ్. సినిమాలు, సోషల్ మీడియాతో తన అభిమానులని అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంది. తన జీవితంలో అనేక పోరాటాలు చేసి కథానాయికగా ప్రయాణం సాగించిన తీరు అంత తేలికేమి కాదు.
Samantha : ఇలా అంటున్నారేంటి?
బాలీవుడ్ లో సమంత సినిమాలు చేస్తుందని ఎన్నో ప్రచారాలు వస్తున్నా ఒక్క సినిమా కూడా అఫిషీయల్ గా అనౌన్స్ చేయలేదు. ఆఫర్లు వస్తున్నాయి అంటున్నారే కానీ, సామ్ సైన్ మాత్రం చేయలేదట. దానికి కారణం, సమంత ను అక్కడ సెకండ్ హ్యాండ్ గానే చూస్తున్నారు కానీ, ఫస్ట్ హీరోయిన్ గా అవకాశాలు ఇవ్వట్లేదట. ఇక్కడేమో సమంత టాప్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్లి సెకండ్ హీరోయిన్ గా చేస్తే ఇన్నాళ్లు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు గంగలో కలిసిపోవడం ఖాయం. మరో పక్క నేషనల్ క్రష్ రష్మిక మాత్రం ..వరుసగా ఆఫర్లు అందుకుంటూ పోతుంది. ఇప్పుడు ఇదే విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
సమంత ఫస్ట్ హీరోయిన్ గా పనికి రాదని.. గెస్ట్ రోల్ కి, ఐటెం సాంగ్ లకి, సెకండ్ హీరోయిన్లకి మాత్రం సరిపోతుందని బాలీవుడ్ ఇండస్ట్రీ ఫిక్స్ చేసినట్టు కొందరు ప్రచారం చేస్తున్నారు. అందుకే అమ్మడుకి మంచి ఆఫర్స్ రావట్లేదని అంటున్నారు. మరి ఈ పుకార్లకి సమంత తన సినిమా ఆఫర్స్ తోనే సమాదానం చెప్పాల్సి ఉంది. ఏమాయ చేసావే సినిమా తెలుగు తెరకు పరిచయమైన సామ్.. ఇప్పుడు అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. సమంత నటించిన శాకుంతలం, యశోద, ఖుషీ చిత్రాలు విడుదల కావలసి ఉంది. ఈ మూడు చిత్రాలు మంచి కథతో రూపొందినవే.