Samantha : సమంత మళ్ళీ తిరిగి వస్తుంది. వస్తుంది.. ఇది చూస్తే మీరే ఆ మాట అంటారు..! Finteness తో Myostis త్వరగా Overcome చేయచ్చు..
Samantha : గత శనివారం సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్టు ప్రకటించడంతో అందరు అవాక్కయ్యారు. ఎప్పుడు ఫిట్‌నెస్‌గా ఉండే సమంత ఇలా సడెన్‌గా అనారోగ్యం బారిన పడడం అందరిని ఆశ్చర్యపరచింది. సమంత ఆరోగ్య పరిస్థితి గురించి ప్రతి ఒక్కరు వాకబు చేయడం మొదలు పెట్టారు. మయోసిటిస్.. ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఈ ఒక్క వ్యాధి కారణంగా.. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది శరీరాన్ని నెమ్మదిగా విచ్ఛిన్నం చేస్తుంది. మైయోసిటిస్ రుమటాలాజికల్ వ్యాధి అని డాక్టర్ బీరెన్ నద్కర్ణి చెప్పారు. ఈ సమస్య కారణంగా నడవడానికి ఉపయోగాపడే కండరాలలో వాపు, నొప్పి, బలహీనవపడటం వంటి సమస్యలు ఎదురవుతాయి.
సరైన వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం వలన ఈ వ్యాధి నుండి త్వరగా కోలుకోవచ్చు. అయితే సమంత తన ఆరోగ్యం కోసం ఎప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. యోగా నుండి పౌష్టికాహారం ఆహారం వరకు, ఆమె స్థిరమైన జీవన విధానాన్ని పాటించాలని నమ్ముతుంది. సమంత ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌ను పూర్తిగా పరిశీలిస్తే, అందులో ఆరోగ్యానికి చేసిన సూచనలకు సంబంధించిన చాలా వీడియోలు ఉంటాయి. అవి ఖచ్చితంగా మిమ్మల్ని జిమ్‌కి వెళ్లడమే కాకుండా ప్రతిరోజూ ఆనందంతో వ్యాయామం చేసేలా చేస్తాయి. ఎందుకంటే ‘హ్యాపీ వర్కౌట్ ఈజ్ హ్యాపీ బాడీ’ అని సామ్ నమ్ముతుంది.
Samantha : ఇంత పర్‌ఫెక్ట్‌గా..
సమంత తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తన వర్కౌట్ సెషన్ వీడియోలని పంచుకుంటూనే ఉంటుంది. ఒకసారి జిమ్‌లో కసరత్తులు చేయడం, మరోసారి తన పెట్ డాగ్‌తో ఆటలు ఆడడం, ఇంకోసారి ఇంటిపైనే మొక్కల పెంపకం ఇలా ప్రతీది కూడా పర్‌ఫెక్ట్ ప్లాన్‌తో చేస్తూ ముందుకు వెళుతుంది సమంత. డౌట్ విషయంలో పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. సాధారణంగా 5-15, 45-60 ఏళ్ల వయస్కులు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. సమంత యంగ్ ఏజ్ లోనే ఉంది కాబట్టి.. జాగ్రత్తలు తీసుకుంటూ.. మెడిసిన్ వాడితే త్వరగా కోలుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు సమంతకు వచ్చిన అనారోగం గురించి తెలుసుకొని.. ఆమె అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలోపోస్టులు పెట్టారు