Samantha : సినిమాలు చేయ‌క‌పోయిన స‌మంత‌నే టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్.. షాక్ ఇస్తున్న లేటెస్ట్ స‌ర్వే | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Samantha : సినిమాలు చేయ‌క‌పోయిన స‌మంత‌నే టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్.. షాక్ ఇస్తున్న లేటెస్ట్ స‌ర్వే

Samantha : సినీ ప్రేక్ష‌కులు సెల‌బ్రిటీల‌కి సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని చాలా ఆస‌క్తిగా గ‌మ‌నిస్తుంటారు. వారు అభిమానించే స్టార్స్ మంచి పొజీష‌న్‌లో ఉండాల‌ని, వారికి మంచి స‌క్సెస్ రావాల‌ని కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ క్ర‌మంలోనే ఓ మీడియా సంస్థ టాలీవుడ్ టాప్ 10 హీరోయిన్స్ ఎవరనే దానిపై ఓ స‌ర్వే నిర్వ‌హించింది. మోస్ట్ పాప్యులర్ ఫిమేల్ స్టార్స్ తెలుగు పేరిట నిర్వ‌హించిన ఈ స‌ర్వేలో స‌మంత‌కి టాప్ ప్లేస్ ద‌క్కింది. ఇక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌కి ప‌దో […]

 Authored By ramu | The Telugu News | Updated on :18 May 2024,6:00 pm

Samantha : సినీ ప్రేక్ష‌కులు సెల‌బ్రిటీల‌కి సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని చాలా ఆస‌క్తిగా గ‌మ‌నిస్తుంటారు. వారు అభిమానించే స్టార్స్ మంచి పొజీష‌న్‌లో ఉండాల‌ని, వారికి మంచి స‌క్సెస్ రావాల‌ని కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ క్ర‌మంలోనే ఓ మీడియా సంస్థ టాలీవుడ్ టాప్ 10 హీరోయిన్స్ ఎవరనే దానిపై ఓ స‌ర్వే నిర్వ‌హించింది. మోస్ట్ పాప్యులర్ ఫిమేల్ స్టార్స్ తెలుగు పేరిట నిర్వ‌హించిన ఈ స‌ర్వేలో స‌మంత‌కి టాప్ ప్లేస్ ద‌క్కింది. ఇక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌కి ప‌దో స్థానం ద‌క్కింది. టిల్లు స్క్వేర్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనుమ‌ప‌కి ప‌దో స్థానం ద‌క్క‌డం విశేషం. ఇక పూజా హెగ్డే 9వ ర్యాంక్ కి పడిపోవడం అనూహ్య పరిణామం. పూజ హెగ్డే తెలుగులో నటించి రెండేళ్లు కావ‌డం, ఒక్క హిట్ లేక‌పోవ‌డంతో ఆమె ర్యాంక్ మ‌రింత కిందకు వ‌చ్చేసింది.

Samantha : స‌మంతనా, మ‌జాకానా?

ఇక కీర్తి సురేష్ 8వ స్థానంలో ఉంది. ఆమె గత ఏడాది దసరా, భోళా శంకర్ చిత్రాల్లో నటించింది. ఇక మిల్కీ బ్యూటీ తమన్నాకు 7వ స్థానం ఇచ్చారు ప్రేక్షకులు. ఇప్పుడు తమన్నా ఫేమ్ తగ్గింది. అడపాదడపా ఆఫర్స్ అయితే వస్తూనే ఉన్నాయి. రష్మిక మందాన కనీసం టాప్ 5లో లేకపోవడం అనూహ్య పరిణామం. యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన రష్మిక మందాన అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్. ఆమెకు 6వ స్థానం దక్కింది. సాయి పల్లవి తెలుగులో సినిమా చేసి చాలా కాలం అవుతున్నా ఆమె ఫేమ్ ఏ మాత్రం త‌గ్గలేదు. పూజా హెగ్డే, కీర్తి సురేష్, రష్మిక మందాన కంటే ఆమె మెరుగైన రాంక్ సాధించింది. 5వ స్థానంలో నిలిచింది.

Samantha సినిమాలు చేయ‌క‌పోయిన స‌మంత‌నే టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ షాక్ ఇస్తున్న లేటెస్ట్ స‌ర్వే

Samantha : సినిమాలు చేయ‌క‌పోయిన స‌మంత‌నే టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్.. షాక్ ఇస్తున్న లేటెస్ట్ స‌ర్వే

కన్నడ భామ శ్రీలీల 4వ స్థానంలో నిలిచి సత్తా చాటింది. ఆమె ఖాతాలో ప్లాప్స్ ఎక్కువగా ఉన్నా ఫుల్ క్రేజ్ అభిమానుల‌లో ఉంది. ఇక ఆచితూచి సినిమాలు చేస్తున్న అనుష్క శెట్టి 3వ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఆమె నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి విడుదలైంది. అనుష్క ఎవర్ గ్రీన్ హీరోయిన్ అనిపించుకుంది. పెళ్లయ్యాక కాజల్ జోరు తగ్గింది. గత ఏడాది భగవంత్ కేసరి మూవీలో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర చేసింది. ఫార్మ్ లో లేని కాజల్ కి జనాలు 2వ స్థానం కట్టబెట్టారు. ఇక టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ కిరీటం సమంతకు దక్క‌డం విశేషం. ఏడాదిగా సినిమాలు చేయ‌కుండా ఉన్న స‌మంత టాప్ వ‌న్ స్థానం ద‌క్కించుకోవ‌డం విశేషం.

క్కింది. నిజానికి సమంత కూడా ఫార్మ్ లో లేరు. దాదాపు ఏడాది పాటు బ్రేక్ తీసుకుంది. ఖుషి, శాకుంతలం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయినా… సమంత టాలీవుడ్ టాప్ హీరోయిన్ అని జనాలు కన్ఫర్మ్ చేశారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది