
samantha-latest-post-viral-on-social-media
Samantha : ఇటీవల సమంత సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇండస్ట్రీకి హీరోయిన్ గా అడుగుపెట్టిన సమంత కు అంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది కాదు. కానీ నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తన రేంజ్ మారిపోయింది. మనకు తెలిసిందే సమంత నాగచైతన్యలు ఒకరిని ఒకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏమైందో ఏమో తెలియదు కానీ పెళ్లయిన నాలుగు సంవత్సరాలకి వీరిద్దరూ విడిపోవాలని డిసైడ్ అయ్యారు. అంత అన్యోన్య దంపతులుగా ఉన్న వీరు సడన్గా విడాకులు తీసుకొని అందరిని షాకింగ్ కి గురి చేశారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ వాళ్ళు బిజీగా గడుపుతున్నారు.
samantha-latest-post-viral-on-social-media
ప్రస్తుతం సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న సమంత పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది. అయితే తాజాగా సమంత తన సోషల్ మీడియా ఖాతాలో తను ప్రేమించే వ్యక్తి గురించి ఓ పోస్ట్ పెట్టింది. సమంతకు లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి అంటే ఎంతో ఇష్టం. ఆమె డైరెక్షన్లో ‘ ఓ బేబీ ‘ సినిమాలో కూడా నటించింది. అంతేకాదు నాగచైతన్య సమంత కాంబినేషన్ లో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ సినిమా అలానే ఆగిపోయింది. దీంతో నందినీ రెడ్డికి సమంతకు గ్యాప్ వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
samantha-latest-post-viral-on-social-media
అయితే రీసెంట్గా సమంత అవన్నీ ఫేక్ అని కొట్టి పడేసింది. నందినీ రెడ్డి బర్త్ డే సందర్భంగా సమంత ఓ పోస్ట్ పెట్టింది. అందులో ‘ లైఫ్ లో ప్రతి ఒక్కరికి నీలాంటి ఫ్రెండ్ ఉండాలి, కష్ట సమయాలలో ఆదుకోవడానికి నేనున్నాను అని ధైర్యం చెప్పడానికి, ప్రతి ఒక్కరికి నీలాంటి మంచి స్నేహితురాలు ఉండాలి, నువ్వు లేకుండా నేను లేను, నా లైఫ్ లో నువ్వు చాలా ఇంపార్టెంట్, నీపై ప్రేమను మాటల్లో చెప్పలేకపోతున్నా ‘ అని పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే సమంతకు నందినీ రెడ్డి అంటే అంత ఇష్టమా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక త్వరలోనే సమంత నందిని రెడ్డి డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి.
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
This website uses cookies.