Samantha : త‌మిళ హీరోతో రొమాన్స్ చేయ‌నున్న స‌మంత‌.. ఈ కాంబినేష‌న్ సెట్ అయ్యేనా?

Authored By Sam C | The Telugu News | Published on: January 30, 2022, 7:00 pm

Samantha : ఏ మాయ చేశావే చిత్రంతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ స‌మంత‌. ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌ల నాగ చైత‌న్య‌కు విడాకులు ఇచ్చి తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. కొన్నేళ్ల క్రితం అగ్నిసాక్షిగా ఒక్కటై.. ఇటీవలే విడాకులు తీసుకున్నారు టాలీవుడ్ కపుల్ సమంత, నాగ చైతన్య. సినిమాల ద్వారా ప్రేమలో పడిన వీళ్లిద్దరూ వివాహ బంధం మొదలైన తర్వాత నుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే మధ్యలో ఇద్దరి మధ్యా విభేదాలు తలెత్తడంతో దూరంగా ఉంటూ వచ్చారు. ఇలా కొద్ది నెలల పాటూ వేరు వేరుగా ఉంటూ వచ్చిన చై సామ్.. గత అక్టోబర్‌లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

విడాకుల త‌ర్వాత స‌మంత సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ ఇలా వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌. అయితే ఈ అమ్మ‌డు త‌మిళ హీరో కార్తీ స‌ర‌స‌న న‌టించే అవకాశాన్ని అందిపుచ్చుకున్న‌ట్టు స‌మాచారం. కార్తీ తమిళంతో పాటు తెలుగులోను ప్ర‌త్యేక అభిమాన గ‌ణాన్ని ఏర్ప‌ర‌చుకున్నాడు. ఖైదీ సినిమాతో ఒక్కసారిగా కార్తీ తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. ఖైదీ తరువాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ సొంతం చేసుకోలేకపోయాడు. చినబాబు అంటూ ఓ మాదిరి విజయాన్ని అందుకున్నాడు.ఇప్పుడు కార్తీ.. స‌మంత‌తో క‌లిసి స‌రికొత్త ప్ర‌య‌త్నం చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తుంది.

samantha may as female lead in karthi film

samantha may as female lead in karthi film

Samantha : స‌మంత ఓకే అంటుందా..

సమంత ఇప్పుడు నేషనల్ లెవెల్‌లో స్టార్ అయిపోయింది. తమిళ, తెలుగు చిత్రాలు చేస్తూ ఉన్నా కూడా సమంత మాత్రం బాలీవుడ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కార్తీ సినిమాకు ఓకే చెబుతుందా? అనే అనుమానాలు అంద‌రిలో వ్య‌క్తం అవుతున్నాయి. యంగ్ డైరెక్టర్ సతీష్ సెల్వకుమార్ ద‌ర్శ‌కత్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుండ‌గా, ఈ సినిమా కోసమే సమంతను తీసుకోవాలని చర్చిస్తున్నారట. మ‌రి ఈ సినిమా కోసం స‌మంత డేట్స్ కేటాయిస్తుందా లేదా, అనేది చూడాలి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp