Samantha : సమంత – నాగ చైతన్యల ఆస్తి ఎంతో తెలిస్తే నోట మాట రాదు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : సమంత – నాగ చైతన్యల ఆస్తి ఎంతో తెలిస్తే నోట మాట రాదు..!

 Authored By govind | The Telugu News | Updated on :7 May 2021,6:10 pm

Samantha : సమంత ఇప్పుడు అక్కినేని సమంత. టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున కొడుకు అక్కినేని నాగ చైతన్య టాలీవుడ్ యంగ్ హీరోలలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. సమంత మొదటి సినిమా నాగ చైతన్యతోనే చేసింది. గౌతం మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన సమంత మొదటి సినిమాలో కలిసి నటించిన నాగ చైతన్య తో ప్రేమలో పడింది. ప్రేమలో ఉండే ఇద్దరు కలిసి సినిమాలు చేశారు. ప్రేక్షకుల్లో సమంత – చైతు జంటకి విపరీతమైన క్రేజ్ ఉంది.

samantha naga chaitanya property almost 125 crores

samantha-naga-chaitanya-property-almost-125-crores

ఈ కారణంగానే దర్శక నిర్మాతలు వీరితో సినిమాలు, యాడ్ ఫిలింస్ తీసేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటున్నారు. అయితే పెళ్ళి తర్వాత సమంత – నాగ చైతన్య మజిలీ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఇద్దరు కలిసి ప్యాకేజీలో రెమ్యునరేషన్ అందుతుకున్నారట. అంతేకాదు పెళ్ళి తర్వాత వీరిద్దరు కలిసి చేసిన కమర్షియల్ యాడ్ ఫిలింస్ కూడా చాలానే ఉన్నాయి. అలా అటు సినిమాలు ఇటు కమర్షియల్ యాడ్ ఫిలింస్ తో పాటు సొంత వ్యాపారలతో బాగానే సంపాదిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

Samantha : సమంత – నాగ చైతన్యల ఆస్తి దాదాపు 125 కోట్ల వరకు ఉంటుందా..?

కాగా ప్రస్తుతం వీరి ఆస్తుల గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సమంత ఆదాయం దాదాపు 85 కోట్లు ఉండగా చైతూ ఆదాయం ఓ 40 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఇద్దరి ఆదాయం దాదాపు 125 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇక సమంత ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమా శాకుంతలం చేస్తుండగా నాగ చైతన్య నటించిన లవ్ స్టోరి రిలీజ్ కి రెడీగా ఉంది. అలాగే థాంక్యూ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది