Samantha: ఎప్పటికీ వాటిని దాచి పెట్టలేం అంటూ సమంత లేటెస్ట్ పోస్ట్.. ఇన్‌డైరెక్ట్‌గా నాగ చైతన్యను నిందిస్తోందా..?

Authored By vamana sai | The Telugu News | Published on: September 23, 2021, 11:30 am

Samantha: అక్కినేని సమంత కాస్త ఇప్పుడు జస్ట్ సమంత అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం ఆమె తన పేరు పక్కన అక్కినేని అనే పదం తొలగించడమే. ఇక సమంత – నాగ చైతన్య విడాకులకి సంబంధించి ఈ మధ్య వరుసగా సోషల్ మీడియాలో రక రకాల రూమర్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అంతక ముందు సమంత అయితే ఈ పాటికే ఇలాంటి రూమర్స్‌కి స్పందించి సెటైర్లు వేసేది. కానీ ఎందుకనో ఈ మధ్య వీటిని అస్సలు పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటోంది. కానీ వీటిని చాలా లైట్‌గా తీసుకుంటోంది. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలు చేసుకుంటోంది. కొత్తగా సూక్తులను అభిమానులతో పంచుకుంటోంది. ఒకరకంగా వేధాంత వల్లిస్తోంది.

samantha New post on naga chaitanya

samantha New post on naga chaitanya

తాజా పోస్ట్ చూస్తే ఈ మధ్య సోషల్ మీడియాలో సమంత – నాగ చైతన్య విడాకుల వ్యవహారం మీద వస్తోన్న రూమర్లకు రియాక్షన్‌లకు లింక్ ఉన్నట్టు తెలుస్తోంది. కామన్‌గా సమంత తన ఇన్ స్టా స్టోరీలో రోజూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఉంటుంది. కానీ ఈ మధ్య ప్రేమ – పెళ్లి, బంధాలు – విలువలు, తప్పొప్పులు.. ఇలా కొన్నింటి గురించి ప్రత్యేకమైన అర్థం వచ్చేలా పోస్ట్‌లు పెడుతూ షాకిస్తోంది. ‘నువ్ నన్ను హర్ట్ చేసి ఉండొచ్చు.. నేను నిన్ను హర్ట్ చేసి ఉండొచ్చు.. మనం ఇద్దరం ఒకరినొకరు హర్ట్ చేసుకుని ఉండొచ్చు.. ఏదైనా సరే రియాల్టీ ఇదే.. శిశిరాన్ని అనుభవిస్తేనే వసంతం దొరుకుతుంది’.. అంటూ పరోక్షంగా ఏదో అర్థం వచ్చేలా సినిమా డైలాగ్స్ వంటి కోట్స్ షేర్ చేసింది.

Samantha: “ఎదుటి వాళ్లు మనకు చేసిందే.. తిరిగి మనం కూడా వాళ్లకు చేస్తే.. ప్రశ్నించే హక్కును కోల్పోతాం”..


అంతేకాదు “ఎదుటి వాళ్లు మనకు చేసిందే.. తిరిగి మనం కూడా వాళ్లకు చేస్తే.. ప్రశ్నించే హక్కును కోల్పోతాం”.. అంటూ అందరినీ ఆలోచింపజేసే పోస్ట్‌లు, కొటేషన్లను షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత బుద్దుని మాటలను షేర్ చేసింది. ‘ఎప్పటికీ దాచలేనివి మూడున్నాయి.. అందులో సూర్యుడు, చంద్రుడు, నిజం’.. అని రాసుకొచ్చింది. దీన్ని బట్టి చూస్తే సమంత – నాగ చైతన్యల విడాకుల వ్యవహారం వెనుక దాగి ఉన్న అసలు నిజం త్వరలోనే బయటకు వస్తుందనే ఉద్దేశ్యంతోనే.. సమంత ఈ పోస్ట్ చేసిందా?.. లేక.. నాగ చైతన్య వల్లే ఇలా జరుగుతోందని నిందలు వేసేందుకు ఇటువంటి పోస్టులు పెడుతుందా అనేది ఇప్పుడు అభిమానులకి అర్థం కావడం లేదు. మరి దీనిపై స్పస్పెన్స్ ఎప్పుడు తొలగిపోతుందో చూడాలి.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp