Samantha : గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. ఆగస్ట్ 7 ఉదయం 7గం.లకు బిడ్డకు జన్మనిస్తా
Samantha: అందాల ముద్దుగుమ్మ సమంత విడాకుల నుండి నిత్యం వార్తలలో నిలుస్తుంది.ఈ అమ్మడు చేసే రచ్చ మాములుగా లేదు. పదేళ్ల కెరీర్ లో సమంత నెమ్మదించిన దాఖలాలు లేవు. ఆమెకు వరుసగా హిట్ దక్కాయి. సమంత హైయెస్ట్ హిట్ పర్సెంటేజ్ కలిగిన హీరోయిన్. టాప్ స్టార్స్ అందరితో నటించిన సమంత బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్స్ కొట్టింది. ఇప్పుడు కూడా సమంత మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తుంది. అయితే నాగ చైతన్యతో మనస్పర్థలు, విడాకుల వలన మానసిక వేదనతో కొన్నాళ్ళు సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.విడాకుల వలన సమంత దాదాపు ఆరు నెలలు మనోవేదన అనుభవించారు. ఈ సమయంలో ఆమెకు స్నేహితులు అండగా నిలిచారు.
డిప్రెషన్ నుండి బయటపడడానికి స్నేహితులతో వరుస విహారాలు చేశారు. మొత్తంగా కోలుకున్న సమంత కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేశారు. దర్శకుడు గుణశేఖర్ తో చేస్తున్న శాకుంతలం మూవీ షూటింగ్ పూర్తి చేసిన ఆమె… యశోద అనే మరో కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నారు. అయితే సమంత విడాకుల వ్యవహారం ఇప్పటికీ చర్చనీయాంశంగానే మారుతుంది. ఆమె పాత పోస్ట్‌లు కూడా కొందరు బయటకు తీసి వైరల్ చేస్తుండడంతో హాట్ టాపిక్ అవుతుంది.తాజాగా సమంత చైతూను మెచ్చుకుందని, ఇది వాళ్లిద్దరూ కలవడానికి సంకేతమంటూ వార్తలు వెలువడుతున్నాయి. సమంత చైతూని పొగడడం వాస్తవమే, కానీ అది పాత వీడియో. వీళ్లిద్దరూ భార్యాభర్తలుగా కొనసాగుతున్న సమయంలో సామ్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె మాట్లాడుతూ.. ‘చై హజ్బెండ్ మెటీరియల్.

samantha pregnancy news viral
Samantha : సమంత పోస్ట్ వైరల్..
ఒకసారి మా అమ్మకు ఫోన్ చేయడానికి కూడా నా దగ్గర డబ్బుల్లేవు. అప్పుడు చై వెంటనే తన ఫోన్ ఇచ్చి ఎంతసేపైనా మాట్లాడుకోమన్నాడు. చైతూ నిజంగా పర్ఫెక్ట్ జెంటిల్ మ్యాన్’ అని పొగడ్తలు కురిపించింది. ఇక చైతూతో మంచిగా ఉన్న సమయంలో ఆస్క్ మీ ఎనీథింగ్(ప్రశ్నలు-సమాధాలు) పేరుతో లైవ్‌చాట్‌కు వచ్చిన ఆమెకు ఫ్యాన్స్ నుంచి ప్రెగ్నెన్సీ ప్రశ్న ఎదురైంది. దీంతో ఆమె స్పందిస్తూ.. ‘నా శరీరంలో వచ్చే మార్పుల కోసం మీరంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అర్థమైంది. అలాంటి వారికి ఓ గుడ్‌న్యూస్ చెబుతున్నా.. 2022 ఆగస్ట్ 7వ తేదీ ఉదయం 7గంటలకు ఓ బిడ్డకు జన్మనివ్వబోతోన్న’ అంటూ సమాధానం ఇచ్చింది. ఇప్పుడు ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.