Samantha: స‌మంత ప్రెగ్నెంటా.. నోరెళ్ల‌పెడుతున్న నెటిజ‌న్స్ ?

Authored By Sam C | The Telugu News | Published on: January 18, 2022, 4:00 pm

Samantha: గ‌త కొద్ది రోజులుగా టాలీవుడ్ వర్గాల్లో సమంత- నాగ చైతన్య విడాకుల ఇష్యూపై హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. అక్కినేని కుటుంబంతో ఆ ఇంటి కోడలు సమంత కట్ చేసుకోవ‌డం, నాగ చైతన్యతో డివోర్స్ తీసుకోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. సమంత తన ట్విట్టర్ అకౌంట్‌లో ‘అక్కినేని’ అనే పేరును ఎప్పుడైతే తీసేసిందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. అక్కినేని ఫ్యామీలీ కండీషన్స్ నచ్చక సమంత తన వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టింద‌నే వార్తలు గుప్పుమన్నాయి. వాటితో పాటు చైతన్యతో సామ్ విడిపోవడానికి కారణం పిల్లలు అని, సామ్ పిల్లలు కావాలనుటుండగా.. చై వద్దని అన్నాడని, అందుకే అభిప్రాయ బేధాల వలన వారు విడిపోయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

గ‌ర్భ‌వ‌తి అంటూ పుకార్లు..

samantha pregnanet woman role in yashoda movie

samantha pregnanet woman role in yashoda movie

స‌మంత‌కు పిల్ల‌లు కావాల‌ని ఎంతో అనుకునేద‌ట‌. ఇటీవ‌ల కాజ‌ల్ ప్రెగ్నెంట్ ప్ర‌క‌టించ‌గా, వెంట‌నే ఆమెకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఆనందం వ్య‌క్తం చేసింది. అయితే అక్కినేని ఫ్యామిలీ పిల్లల్ని కనాలని ఒత్తిడి చేసిందని.. పిల్లల్ని కంటే తన అందం దెబ్బ తిని సినిమా అవ‌కాశాలు త‌గ్గిపోతానే కార‌ణంతోనే చైతుకు ఆమె విడాకులు ఇచ్చేసింద‌ని మ‌రో ప్ర‌చారం జరుగుతోంది. ఇటీవ‌ల స‌మంత‌కు మీరు ప్రెగ్నెంట్ అని అడిగితే షాకింగ్ సమాధానం చెప్పారు. నేను 2017 నుండి గర్భవతిని. ఈ పాప నిజంగా బయటకు రావాలని కోరుకోవడం లేదు.. అంటూ సెటైరిక‌ల్‌గా చెప్పింది స‌మంత‌. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు నేను గ‌ర్భ‌వ‌తినే.. అని వ్యంగ్యంగా స‌మాధానం ఇచ్చింది.

ఇదిలా ఉంటే స‌మంత ప్ర‌స్తుతం య‌శోద అనే చిత్రం చేస్తుంది. హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సామ్ ప్రెగ్నెంట్ గా కనిపించబోతుందంట. ఇప్పటికే ఈ సినిమాలో సామ్ నర్స్ గా కనిపిస్తుందని వార్తలు గుప్పుమంటున్న వేళ ఆమె ప్రెగ్నెంట్ కూడా కనిపిస్తుంది అనేసరికి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సామ్ కల ఈ విధంగానైనా నెరవేరబోతోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది రానున్న రోజుల‌లో తెలియ‌నుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp