Samantha : ఒకే కారులో సమంత – రాజ్ నిడిమోరు.. డేటింగ్ రూమర్స్‌కు ఊతమిచ్చిన వీడియో
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ ఒక రెస్టారెంట్‌లో డిన్నర్‌కు వెళ్లినట్టు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇటీవల కాలంలో సమంత, రాజ్ నిడిమోరు మధ్య కొనసాగుతున్న సన్నిహితతపై పలు వార్తలు వెలుగులోకి వచ్చాయి. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారన్న ప్రచారం ఊపందుకుంది.
Samantha : నిజం ఎంత?
కొంతమంది అయితే త్వరలోనే వీరు పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా వీరిద్దరూ మరోసారి జంటగా కనిపించడంతో ఈ గాసిప్స్‌కు మరింత బలం చేకూరింది.అయితే ఇప్పటివరకు వీరిద్దరిలో ఎవ్వరూ కూడా ఈ వార్తలపై స్పందించలేదు. సమంత ప్రస్తుతం తన ఆరోగ్యం, పర్సనల్ లైఫ్‌ను ప్రాధాన్యతగా తీసుకుంటుండగా, రాజ్ నిడిమోరు కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

Samantha : ఒకే కారులో సమంత – రాజ్ నిడిమోరు.. డేటింగ్ రూమర్స్‌కు ఊతమిచ్చిన వీడియో
గతంలో వీరిద్దరూ కలిసి ఓ వెబ్ సిరీస్ కోసం పని చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఏర్పడిన స్నేహం మరింతగా అభివృద్ధి చెందిందని సినీ వర్గాల్లో చెబుతున్నారు. అయినా, ఇది స్నేహమా? లేక నిజంగా కొత్త జీవితం వైపు అడుగులా? అన్నదానిపై క్లారిటీ మాత్రం ఇప్పటివరకు రాలేదు.ఇకపై ఈ జంటపై మరిన్ని వార్తలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఒకే కారులో సమంత, రాజ్ నిడిమోరు.. మరోసారి వార్తల్లోకి..!
బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కొంతకాలంగా సమంత డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో హల్చల్
త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు
ఈ క్రమంలో మరోసారి జంటగా కనిపించిన సమంత, రాజ్
వీరిద్దరూ కలిసి ఓ… pic.twitter.com/MOJSM0sqgf
— BIG TV Breaking News (@bigtvtelugu) July 31, 2025