Home » Entertainment » Samantha Said Thanks To Cine Lovers Instagram
Entertainment

Samantha : అన్నిటి కంటే సెక్సీగా కనబడటానికి చాలా కష్టపడ్డానన్న సమంత.. ఐట‌మ్ సాంగ్ పై ట్వీట్‌..!

Authored By
mallesh
The Telugu News | Updated on: December 20, 2021 10:02 pm
Advertisement

Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో స్పెషల్ సాంగ్ చేసిన సంగతి అందిరికీ విదితమే. ఈ చిత్రంలో ‘ఊ అంటావా మావా..’ అనే ఐటెం సాంగ్‌కు బన్నీతో కలిసి చిందేసింది సమంత. ఈ సాంగ్‌కు చంద్రబోస్ లిరిక్స్ అందించగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ పాట సోషల్ మీడియా, యూట్యూబ్‌లో రికార్డులన్నిటినీ తిరగరాసింది.ఈ నెల 17న ‘పుష్ప’ సినిమా విడుదలైంది. థియేటర్స్‌లో ‘ఊ అంటావా’ సాంగ్ చూసి ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఈలలు కొడుతూ, పేపర్స్ విసరుతూ పాటను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సమంత.. ఐటెం సాంగ్‌లో బన్నీని మ్యాచ్ చేస్తూ సూపర్బ్‌గా స్టెప్స్ వేసిందని ఈ సందర్భంగా మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్ చూసి మూవీ యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.సమంత తొలిసారి చేసిన ఐటెం సాంగ్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో తాజాగా ఆమె స్పందించింది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టింది. తాను తీసుకునే డెసిషన్‌ సక్సెస్ అయ్యేందుకుగాను చాలా కష్టపడతానని సమంత చెప్పుకొచ్చింది.

samantha said thanks to cine lovers instagram

Advertisement

Samantha : తనను ప్రేమిస్తున్న అందరికీ థాంక్స్ చెప్పిన సమంత..

పాటకు బాగా డ్యాన్స్ చేశానని, ఫన్నీ, సీరియస్‌గానూ కనిపించినాని, అయితే, అన్నటికంటే ఎక్కువగా తాను సెక్సీగా కనిపించడానికి కష్టపడ్డానని సమంత తెలిపింది. ఈ క్రమంలోనే తనపై ప్రేమ చూపుతున్న అందరికీ థాంక్స్ చెప్పింది సమంత. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – ఐకాన్ స్టార్ బన్నీ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ ‘పుష్ప’లో బన్నీకి జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన నటించింది. ఇందులో కీలక పాత్రల్లో సునీల్, అనసూయ భరద్వాజ్ కనిపించారు. విలన్‌గా మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ నటించారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి