పైట పట్టుకుని లాగాడని అనుకున్నారట.. చిరంజీవి చిలిపి పని వైరల్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

పైట పట్టుకుని లాగాడని అనుకున్నారట.. చిరంజీవి చిలిపి పని వైరల్

చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. కెమెరా ఆన్ అయితే చాలు చిరులోని కామెడీ టైమింగ్ అలా తన్నుకొస్తుంది. అది వెండితెరైనా, బుల్లితెరైనా, ఏదైనా టాక్ షో అయినా సరే చిరు శైలే వేరు. ప్రస్తుతం సమంత హోస్ట్‌గా నిర్వహిస్తోన్న సామ్ జామ్ షోలో చిరు గెస్ట్‌గా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఫోటోలు ఎప్పుడో బయటకు వచ్చేశాయి. డిసెంబర్ 25న ప్రసారం కాబోతోన్న ఈ షోకు సంబంధించిన ప్రోమోలు ఒక్కొక్కటిగా […]

 Authored By uday | The Telugu News | Updated on :23 December 2020,8:56 am

చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. కెమెరా ఆన్ అయితే చాలు చిరులోని కామెడీ టైమింగ్ అలా తన్నుకొస్తుంది. అది వెండితెరైనా, బుల్లితెరైనా, ఏదైనా టాక్ షో అయినా సరే చిరు శైలే వేరు. ప్రస్తుతం సమంత హోస్ట్‌గా నిర్వహిస్తోన్న సామ్ జామ్ షోలో చిరు గెస్ట్‌గా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఫోటోలు ఎప్పుడో బయటకు వచ్చేశాయి.

Samantha satires on Chianrjeevi In Sam Jam

Samantha satires on Chianrjeevi In Sam Jam

డిసెంబర్ 25న ప్రసారం కాబోతోన్న ఈ షోకు సంబంధించిన ప్రోమోలు ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. మీ ఫ్రిడ్జ్‌లో ఎప్పుడూ ఉండే ఓ ఐటెం గురించి చెప్పమని సమంత అంటే.. పెగ్, మందా? అంటూ చిరు సైగలు ఇవ్వడం ఎంతగా క్లిక్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తాజాగా సమంత మరోసారి చిరును ఇరికించే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

ఈ ప్రోమోలోనూ చిరంజీవిని ఇరుకున పెట్టేస్తూ సమంత మాట్లాడిన తీరు, వేసిన పంచులు హైలైట్ అవుతున్నాయి. ‘మీరు ఎప్పుడైనా సినిమా చూస్తూ ఏడ్చేశారా’ అంటూ సమంత ప్రశ్నించగా, ఓ సినిమాకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నానని చిరంజీవి అన్నారు. అయితే ఆ తర్వాత కిందకు వంగి కళ్లు తుడుచుకుంటుండగా లైట్స్‌ వేశారని, తాను పైకి లేచేసరికి పైట తన చేతిలో ఉందని నవ్వుతూ చిరంజీవి చెప్పడంతో.. వెంటనే అందుకున్న సమంత ‘మీరు చాలా రొమాంటిక్ అనుకున్నారేమో..!’ అంటూ పంచ్ విసిరింది.

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది