Samantha | స‌మంత సినిమాలు త‌గ్గించ‌డానికి కార‌ణం ఇదా..ఇన్నాళ్ళ‌కి ఓపెన్ అయిందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha | స‌మంత సినిమాలు త‌గ్గించ‌డానికి కార‌ణం ఇదా..ఇన్నాళ్ళ‌కి ఓపెన్ అయిందిగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :21 August 2025,1:00 pm

Samantha | తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో అగ్రనటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సమంత రుత్ ప్రభు మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. గ్రాజియా ఇండియా (Grazia India) తాజా ఎడిషన్ కవర్‌పేజీపై సమంత ముస్తాబైన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన వ్యక్తిత్వం, కెరీర్ దిశగా తీసుకుంటున్న నిర్ణయాలు, ఆరోగ్యంపై ఉన్న అవగాహన తదితర విషయాలను ఎంతో స్పష్టంగా పంచుకున్నారు.

Samantha త‌న‌ని ట్రోల్ చేసే వారికి గ‌ట్టిగా బుద్ది చెప్పిన స‌మంత‌ ద‌మ్ముంటే అది చెయ్‌

Samantha : త‌న‌ని ట్రోల్ చేసే వారికి గ‌ట్టిగా బుద్ది చెప్పిన స‌మంత‌.. ద‌మ్ముంటే అది చెయ్‌..!

క్వాలిటీకి ప్రాధాన్యత

ఇప్పటివరకు చేసిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు తన మనసుకు దగ్గరగా ఉన్నవని పేర్కొన్న సమంత, ఇకపై మాత్రం ఎక్కువ ప్రాజెక్టులు చేయలేనని చెప్పారు.మునుపటిలా ఐదు సినిమాలు ఒకేసారి అంగీకరించలేను. శారీరక, మానసిక స్థితిని గుర్తించుకోవాల్సిన అవసరం నాకు ఇప్పుడు తెలుసు. అందుకే పనిలో కొంత తగ్గింపును తీసుకొచ్చాను. అయితే తక్కువ చేసినా, ప్రామాణికత మాత్రం పెరుగుతుంది అని సమంత వ్యాఖ్యానించారు.

ఫిట్‌నెస్‌, వర్క్‌కు సమ ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పిన సమంత, “ఇప్పుడున్న నేను, గతంలోని నాతో పోలిస్తే చాలా మారిపోయాను. మంచి పనులు చేయగల స్థాయికి వచ్చాను ” అంటూ చెప్పుకొచ్చారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు చెప్పిన సమంత, సినీ ప్రయాణం కంటే వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ముఖ్యం అని స్పష్టం చేశారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది