Samantha : మేడమ్ రూమర్స్ వస్తున్నాయి.. గుడికి వచ్చి బుద్ది ఉందా.. విలేకరిపై సమంత ఫైర్.. వీడియో !
Samantha గత కొద్ది కాలంలో అక్కినేని నాగచైతన్యకు హీరోయిన్ సమంత Samantha విడాకులు ఇవ్వబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. చైతన్య, సామ్ మధ్య విభేదాలు ఉన్నాయని, ఈ క్రమంలోనే వారు డైవోర్స్ తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి. కాగా, ఈ విషయాలపై సామ్‌ను అడిగేందుకు ఓ జర్నలిస్టు ప్రయత్నించాడు. దాంతో ఆమె బాగా సీరియస్ అయింది.తాజాగా ఈ ఘటన జరిగింది. తిరుమల శ్రీవారిని సమంత ఈ రోజు దర్శనం చేసుకుంది.
దర్శనం అనంతరం ప్రసాదం తీసుకుని బయటకు వెళ్తుండగా మీడియా ఆమెను చుట్టుముట్టింది. దాంతో ఆమె మీడియా ప్రతినిధుల నుంచి తప్పించుకుని వెళ్లిపోతుండగా, ఓ జర్నలిస్టు మాత్రం మైక్ ఆమె ముందర పెట్టి ‘మీ గురించి రూమర్స్ వస్తున్నాయి’అంటూ ప్రశ్న అడగబోతుండగానే సామ్ సీరియస్ గా రియాక్ట్ అయింది.‘స్వామి వారి దర్శనం చేసుకున్న వస్తున్న టైంలో ఇటువంటి ప్రశ్నలు అడుగుతారా ? అసలు మీకు బుద్ధి ఉందా? అంటూ స్పందించింది.
సోషల్ మీడియా ఈ వీడియో వైరల్ Samantha
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరికి ఎప్పుడు ఏ ప్రశ్నలు అడగాలో తెలియదని పేర్కొంటున్నారు.
ఈ నెల 24న నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరి’ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలోనే సామ్ శ్రీవారిని దర్శించుకుందని ఫ్యాన్స్ డిస్కషన్ చేసుకుంటున్నారు. భర్త నాగచైతన్య సినిమా సూపర్ హిట్ కావాలని సామ్ మొక్కుకుందని కామెంట్స్ చేస్తున్నారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘లవ్ స్టోరి’ ఫిల్మ్‌లో చై సరసన క్యూట్ హీరోయిన్ సాయి పల్లవి నటించింది.
