Samantha : అందుకే విడిపోతోందా?.. సమంత పోస్ట్ అర్థం అదేనా
Samantha ప్రస్తుతం సమంత Samantha నాగ చైతన్యల విడాకుల వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఈ ఇద్దరి గురించిరోజుకో రకమైన వార్తలు వస్తూనే ఉన్నాయి. మనస్పర్థలు పెరిగాయని, దూరంగా ఉంటున్నారని, విడిపోయారని, కోర్టు మెట్లు కూడా ఎక్కేశారని టాక్ వినిపిస్తోంది.ఆ ట్వీట్‌లో నాగ చైతన్య గురించి ఎక్కడా ప్రస్థావించలేదు. కేవలం సాయి పల్లవి గురించి చెప్పింది.
ఇక రేపోమాపో విడాకుల వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటిస్తారనే రూమర్లు ఎక్కువయ్యాయి. అయితే నేపథ్యంలో లవ్ స్టోరీ ట్రైలర్‌పై సమంత ట్వీట్, నాగ చైతన్య రిప్లై మరింత అనుమానాలనుపెంచింది.లవ్ స్టోరీ ట్రైలర్‌ను నాగ చైతన్య ట్వీట్ చేయడం, దాన్ని సమంత రీ ట్వీట్ చేయడంతో రచ్చ మొదలైంది.
విడాకులపై సమంత రియాక్షన్ Samantha
దీంతో అనుమానాలు మొదలయ్యాయి. అందరికీ వెంటనే రిప్లై ఇచ్చిన చై.. సామ్‌కు మాత్రం ఆలస్యంగా రిప్లై ఇచ్చాడు. అది కూడా సింపుల్‌గా థ్యాంక్స్ సామ్ అంటూ ఏదో మొక్కుబడిగా రిప్లై ఇచ్చేశాడు. అలా ఈ ఇద్దరి వ్వవహారం ఏదో రకంగా ట్రెండ్ అవుతోంది.తాజాగా సమంత ఓ కొటేషన్‌ను షేర్ చేసింది. ‘ప్రతీ ఒక్కరి జీవితంలో ఓ గుడ్ న్యూస్ ఉంటుంది.
నీ గొప్పదనం ఏంటో నువ్ తెలుసుకోలేవ్.. నువ్ ఎంత ప్రేమించగలవో కూడా తెలసుకోలేవ్.. నువ్ ఏం సాధించగలవో తెలుసుకోలేవ్.. నీ సత్తా ఏంటో కూడా తెలుసుకోలేవ్’.. అంటూ అన్నె ఫ్రాంక్ చెప్పిన కొటేషన్‌ను సమంత చెప్పింది. తన అమ్మ కూడా ఇలాంటి మాటే చెప్పిందని పేర్కొంది. అంటే సమంత ఇన్నాళ్లకు తన సత్తా తెలుసుకుని చైతన్యతో దూరంగా వెళ్లిపోవాలని ఫిక్స్ అయిందేమో.