Samantha Shaakuntalam Movie Shooting Opening
Samantha : గుణ శేఖర్ ప్రస్తుతం మరో అద్భుతాన్ని క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అసలే గుణ శేఖర్ ఫాం కోల్పోయి ఉన్నాడు. సరైన కమర్షియల్ హిట్ కొట్టి చాలా ఏళ్లు అవుతోంది. చివరగా వచ్చిన రుద్రమదేవీ కూడా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్నే ఇచ్చింది. మళ్లీ ఇన్నేళ్ల తరువాత గుణ శేఖర్ మెగా ఫోన్ పట్టుకోబోతోన్నాడు. మైథలాజికల్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించేందుకు గుణ శేఖర్ భారీ ప్లాన్ వేశాడు. శకుంతల దుష్యంతుల ప్రేమ కావ్యాన్ని తెరపై ఆవిష్కరించబోతోన్నాడు.
శకుంతలగా సమంత నటిస్తోంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ వదిలిన చిన్న వీడియో అందరినీ ఆకట్టుకుంది. దానికి మణిశర్మ కొట్టిన నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. సమంత పక్కన దుశ్యంతుడిగా మళయాలి నటుడిని తీసుకొచ్చారు. దేవ్ మోహన్ అనే నటుడు దుశ్యంతుడిగా నటించబోతోన్నట్టు ప్రకటించేశారు. అయితే ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇక నేడు లాంఛనంగా ఈ మూవీని ప్రారంభించనున్నారు.
Samantha Shaakuntalam Movie Shooting Opening
ఈ మేరకు ప్రారంభోత్సవ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. ఈ వేడుకలో సమంత సంప్రదాయ వస్త్రాదారణలో కనిపించింది. ఈలుక్కులో సమంత అందరినీ మెస్మరైజ్ చేసేలా ఉంది. ఇక నాటి కాలపు దేవ లోకాన్ని మరోసారి రీ క్రియేట్ చేసేందుకు గుణ శేఖర్ సెట్స్ కోసం భారీగానే ఖర్చు పెట్టినట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఈ మూవీతో సమంత తన కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చే చిత్రం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీకి సంబంధించిన వివరాలు మరికాసేపట్లో బయటకు రానున్నాయి.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.