Samantha : నిజాలు అరుదుగా బయటకు వస్తాయ్!.. సమంత ఉద్దేశ్యం అదేనా?
Samantha : సమంత తన ఇన్ స్టా స్టోరీలో పెట్టే పోస్టులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఎవరిని ఉద్దేశించి చెబుతుందో అర్థం కావు. అయితే తనలోని బాధను, ఆవేదనను వ్యక్త పరిచేలా ఉంటాయి. కానీ ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా ఏ పోస్టు వేయలేదు. అయితే విడాకుల ముందు కంటే సమంత రోజూ ఏదో ఒక పోస్టు పెట్టేది.. అందులో ప్రేమ, సత్యం, నిజాయితీ, పురాణాల కథలు చెబుతూ ఉండేది.అయితే సమంత పెట్టే పోస్టులన్నీ కూడా విడాకులకు సంబంధించినవే అని అందరికీ అర్థమైంది.
తీరా మొత్తానికి విడాకుల ప్రకటన చేసేశారు. సమంత నాగ చైతన్యల మీద వచ్చిన రూమర్లే నిజమయ్యాయి. విడాకుల ప్రకటనతో ఎవ్వరూ ఆశ్చర్యపోలేదు. అందుకంటే అనధికారికంగా అందరికీ ఈ విషయం అర్థమైంది. అయితే సమంత చేసే వింత పోస్టుల అర్థం ఏంటో మాత్రం ఎవ్వరికీ అర్థం కాలేదు.తాజాగా సమంత మరో పోస్ట్ పెట్టింది. నిజాలు అనేవి అరుదుగా బయటకు వస్తాయ్.. ఎప్పుడూ కూడా అబద్దాలే ప్రచారంలో ఉంటాయ్ అంటూ ఓ హాలీవుడ్ సినిమా గురించి చెప్పింది.

Samantha Shares The Mystery Of Marilyn Monroe The Unheard Tapes
అంటే సమంత విషయంలో ఇప్పుడన్నీ కూడా అబద్దాలే బయటకు వస్తున్నట్టు తాను చెప్పకనే చెప్పేసింది. అయితే నాగ చైతన్య, సమంత విడాకుల విషయంలో ఇప్పటికే ఎన్నెన్నో కథనాలు బయటకు వచ్చాయి.సమంత వల్లే విడాకులు అయ్యాయ్ అని, సమంతకు ప్రీతమ్ మధ్య అక్రమ సంబంధాలను అంటగట్టారు, ప్రెగ్నెన్సీ కూడా తీయించుకుందని ఇలా పిచ్చి పిచ్చి కథనాలన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా తప్పుడు వార్తలు అని సమంత ఇది వరకే ఖండించిన సంగతి తెలిసిందే.

Samantha Shares The Mystery Of Marilyn Monroe The Unheard Tapes