Samantha : ఊ..అంటావా.. ఊ..ఊ.. అంటావా..మామా అంటున్న సమంత.. ‘పుష్ప’ మాస్ మసాలా సాంగ్ రిలీజ్..
Samantha : మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ పార్ట్ -1 స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత ఈ సాంగ్ చేయగా, చంద్రబోస్ అందించిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘ఊ..అంటావా మామ.. ఊ..ఊ.. అంటావా మామ’ అంటూ సాంగ్ స్టార్ట్ కాగా, ఇందులో సమంత గ్లామర్ షో ఎక్సలెంట్‌గా ఉండబోతున్నదని విడుదలైన వీడియోను బట్టి తెలుస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యట్రిక్ ఫిల్మ్ ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో సమంత పార్ట్-1లో స్పెషల్ సాంగ్‌కు ఓకే చెప్పినప్పటి నుంచి సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా, ఈ స్పెషల్ సాంగ్‌ను ఇంద్రావతి చౌహాన్ అత్యద్భుతంగా ఆలపించారు. ఇటీవల విడదలైన థియేట్రికల్ ట్రైలర్, తాజాగా విడుదలైన ‘ఐటెం సాంగ్’ లిరికల్ వీడియో.. సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్‌ను ఇంకా పెంచేశాయి.

samantha special song released by pushpa film makers
samantha special song released by pushpa film makers
Samantha : గ్లామర్ డోస్ బాగా పెంచేసిన సమంత..
నెవర్ బిఫోర్ మాస్ అవతార్‌లో బన్నీ సినిమాలో ఇరగతీయబోతున్నారు. ట్రైలర్ చూశాక సినిమాలో బన్నీ ద్విపాత్రాభినయం చేశాడనే అభిమానులు అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో భారీ తారగణమే ఉంది. అల్లు అర్జున్ సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన నటిస్తోంది. విలన్‌గా మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నారు. కీలక పాత్రల్లో అనసూయ భరద్వాజ్, సునీల్, అజయ్ ఘోష్ తదితరులు కనిపించనున్నారు. మంగళం శ్రీనుగా సునీల్, దాక్షాయణిగా అనసూయ లుక్స్ సూపర్బ్‌గా ఉండగా, ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ అని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 17న సినిమా విడుదల కానుంది.
