Samantha : సమంత వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతోంది..కానీ అందరికీ అదే టెన్షన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : సమంత వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతోంది..కానీ అందరికీ అదే టెన్షన్..!

 Authored By govind | The Telugu News | Updated on :24 April 2021,8:50 pm

Samantha : సౌత్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని సినిమాల పరంగా ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇటు తెలుగు అటు తమిళ సినిమాలలో స్టార్ హీరోలతో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ఇండస్ట్రీలో సమంత సాధించిన హిట్స్ మరే హీరోయిన్ సొంతం చేసుకొని ఉండదు. ఇంత క్రేజ్ వచ్చినా ఎందుకనో సమంత బాలీవుడ్ సినిమాల మీద ఆసక్తి చూపించలేదు. బాలీవుడ్ లో ఉన్న పెద్ద నిర్మాణ సంస్థల నుంచి క్రేజీ ఆఫర్స్ వచ్చినప్పటికి సమంత సున్నితంగా తిరస్కరించింది. తెలుగు, తమిళ సినిమాలు తప బాలీవుడ్ వైపు చూసే ఆసక్తి లేదని కూడా క్లారిటీ ఇచ్చిన సందర్భాలున్నాయి.

samantha the family man 2 coming soon

samantha-the-family-man-2-coming-soon

కానీ అభిమానులు మాత్రం సమంతని హిందీ సినిమాలలో నటిస్తే చూడాలని కోరుకుంటున్నారు. అయితే సినిమాల పరంగా అభిమానుల కోరిక తీరే అవకాశం లేనప్పటికి వెబ్ సిరీస్ తో అభిమానులు అనుకుంటున్నట్టుగా హిందీలో కనిపించబోతోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ అనే వెబ్ సిరీస్ రెండో సీజన్ తో సమంత బాలీవుడ్ లో అడుగుపెడుతోంది. సమంత వెబ్ సిరీస్ చేస్తుందని తెలియగానే ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు కారణం సమంత డెబ్యూ వెబ్ సిరీస్ కావడమే. గతంలో చాలాసార్లు అవకాశాలు వచ్చినా కూడా సమంతకి సమయం లేక నో చెప్పింది.

Samantha : సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ తో ఎంతవరకు సక్సస్ అవుతుందో..?

కానీ ‘ది ఫ్యామిలీ మ్యాన్-1’ కి మంచి ఆధరణ లభించడంతో ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ లో నటించేందుకు ఒప్పుకుంది. ఇక ఈ సీజన్ లో సమంత నెగిటివ్ రోల్ ప్లే చేస్తుండటం కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే గత ఏడాది నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సీజన్ మేలో రిలీజ్ కాబోతోంది. అయితే సమంత గత చిత్రం జానూ భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఆ ప్రభావం ఇప్పుడు ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ మీద పడే అవకాశం ఉందా అనే కొంత సందేహం కూడా అభిమానుల్లో ఉందట. చూడాలి మరి ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ తో సమంత ఎంతవరకు సక్సస్ అవుతుందో.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది