Samantha : విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర్‌ప్రైజ్‌కి థ్రిల్ అయిన స‌మంత | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర్‌ప్రైజ్‌కి థ్రిల్ అయిన స‌మంత

 Authored By sandeep | The Telugu News | Updated on :29 April 2022,2:30 pm

Samantha : స‌మంత‌-విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం కాశ్మీర్‌లో జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. టక్ జగదీష్ ఫ్లాప్ తరువాత శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న చిత్రమిదే. ఇక మజిలీ సినిమా తరువాత శివ నిర్వాణ మళ్లీ సమంతతో సినిమా చేస్తున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ, సమంతలు కలిసి నటిస్తోన్న ఈ సినిమాను ఇటీవలె ప్రారంభించారు. ఈ మూవీ యూనిట్‌ సమంతకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చిన బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. షూటింగ్‌ సీన్‌ అంటూ ఒక ఫేక్ డైలాగ్‌ను సమంతతో రిహార్సల్‌ జరిపించారు. యాక్షన్‌ అనగానే లవ్‌ ఫీల్‌తో సామ్‌ ఆ డైలాగ్‌ను చెబుతుండగా,

హ్యాపీ బర్త్‌డే సమంత అంటూ విజయ్‌ చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌ అయ్యింది.ఇక డైరెక్టర్‌ శివ నిర్వాణ సహా సెట్లోని వాళ్లంతా హ్యాపీ బర్త్‌డే అంటూ ఒక్కసారిగా అరవడంతో ఇది ఫేక్‌ రిహార్సల్‌ అని అర్థమయ్యింది. ఆ తర్వాత సెట్లోనే సామ్‌ బర్త్‌డేను సెలబ్రేట్‌ చేశారు. దీనికి సంబంధించిన స్పెషల్‌ వీడియోను విజయ్‌ దేవరకొండ షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ సర్‌ప్రైజింగ్‌ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఇక సమంత ఈ సినిమాతో మళ్లీ తన సత్తా చాటనుంది. శివ నిర్వాణ సైతం ఈ సారి మరింత ఎమోషనల్ స్క్రిప్ట్ రాసినట్టు తెలుస్తోంది.

samantha thrilled by vijay devarakonda

samantha thrilled by vijay devarakonda

జన గణ మన సినిమా షూటింగ్ మరో వైపు శివ నిర్వాణ ప్రాజెక్ట్ ఇంకోవైపు చేస్తుండటంతో విజయ్ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు.సమంత సైతం శాకుంతలం సినిమాను పూర్తి చేసేసింది. యశోద షూటింగ్‌తో బిజీగా ఉంది. ఇక ఆమె నటించిన కణ్మణి రాంబో ఖతీజా అనే సినిమా విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డింది.ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే సామ్ ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలతో హీట్ పెంచేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ శాకుంతలం, యశోద, సిటాడెల్ అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ సినిమాలు చేస్తోంది.

YouTube video

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది