Samantha : కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్న సమంత..!
ప్రధానాంశాలు:
Samantha : కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్న సమంత..!
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్‌లో మరో కొత్త అడుగు వేసింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఆమె, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి ప్రముఖ హీరోలతో నటించి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అయితే నాగ చైతన్యతో విడాకుల అనంతరం అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత సమస్యల కారణంగా సమంత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. మయసైటీస్ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత సమంత మరింత జాగ్రత్తగా తన ప్రాజెక్టులను ఎంపిక చేస్తోంది.

Samantha : కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్న సమంత..!
Samantha నిర్మాతగా మారుతున్న సమంత
ఇటీవల బాలీవుడ్ ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లో నటించిన సమంత ఇప్పుడు నిర్మాతగా మారేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే బ్యానర్‌ను స్థాపించి, తొలి చిత్రంగా ‘శుభం’ (Shubham) ను నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తైందని, టీజర్‌ను విడుదల చేసినట్లు సమంత తెలిపారు. “మా ప్రేమపూర్వక చిన్న శ్రమను మీకు అందిస్తున్నాము. ఇది పెద్ద కలలు కన్న చిన్న బృందం” అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది.
నాగ చైతన్య రెండో వివాహం చేసుకున్నా సమంత మాత్రం కెరీర్‌పై దృష్టి పెట్టింది. ఇటీవల వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడం ఆమెకి కొత్త సవాల్‌గా మారనుంది. ప్రస్తుతం సమంత రెండు కొత్త ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ ‘శుభం’ మూవీ నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకుంటోంది. ఆమె షేర్ చేసిన టీజర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ కొత్త ప్రయాణంలో సమంత ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి!