
Samantha : కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్న సమంత..!
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్‌లో మరో కొత్త అడుగు వేసింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఆమె, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి ప్రముఖ హీరోలతో నటించి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అయితే నాగ చైతన్యతో విడాకుల అనంతరం అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత సమస్యల కారణంగా సమంత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. మయసైటీస్ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత సమంత మరింత జాగ్రత్తగా తన ప్రాజెక్టులను ఎంపిక చేస్తోంది.
Samantha : కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్న సమంత..!
ఇటీవల బాలీవుడ్ ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లో నటించిన సమంత ఇప్పుడు నిర్మాతగా మారేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే బ్యానర్‌ను స్థాపించి, తొలి చిత్రంగా ‘శుభం’ (Shubham) ను నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తైందని, టీజర్‌ను విడుదల చేసినట్లు సమంత తెలిపారు. “మా ప్రేమపూర్వక చిన్న శ్రమను మీకు అందిస్తున్నాము. ఇది పెద్ద కలలు కన్న చిన్న బృందం” అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది.
నాగ చైతన్య రెండో వివాహం చేసుకున్నా సమంత మాత్రం కెరీర్‌పై దృష్టి పెట్టింది. ఇటీవల వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడం ఆమెకి కొత్త సవాల్‌గా మారనుంది. ప్రస్తుతం సమంత రెండు కొత్త ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ ‘శుభం’ మూవీ నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకుంటోంది. ఆమె షేర్ చేసిన టీజర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ కొత్త ప్రయాణంలో సమంత ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి!
Today Horoscope 14th February 2026 : వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం శనివారం, ఫిబ్రవరి 14, 2026 నాడు గ్రహాల…
Couple Friendly Movie Review : ప్రముఖ నిర్మాణ సంస్థ UV Creations సమర్పణలో రూపొందిన తాజా యూత్‌ఫుల్ లవ్…
Seetha Payanam Movie Review : యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా Arjun కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా Arjun…
Kalyan - Thanuja : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసి రెండు నెలలు కావస్తున్నా, విన్నర్ కళ్యాణ్…
Sreeja : బిగ్‌బాస్ సీజన్-9 ద్వారా వెలుగులోకి వచ్చిన కామనర్ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన…
Ysrcp : 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తో కేవలం 11 సీట్లే సాధించుకున్న వైసీపీ పార్టీ మళ్ళీ ఇప్పుడు…
Ys Jagan : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెన్నైలో ఒక పెళ్లి వేడుకకు వెళ్తే అది కాస్తా ఇప్పుడు…
Ram Charan Upasana Twins Names : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు సంబంధించి…
This website uses cookies.