Samantha : సమంతను 15 కోట్లకు నిండా ముంచేసిన అనుష్క..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : సమంతను 15 కోట్లకు నిండా ముంచేసిన అనుష్క..!

 Authored By aruna | The Telugu News | Updated on :9 September 2023,10:00 pm

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా సినిమాల పరంగా, అటు వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు విజయ్ దేవరకొండ కు జోడిగా ఆమె నటించిన ‘ ఖుషి ‘ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఫస్ట్ వీకెండ్ లో అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇప్పుడు వసూళ్లు తగ్గుకుంటూ వచ్చాయి. ఇంకా చాలా ఏరియాలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లోకి రావాల్సి ఉంది. కానీ ఓవర్సీస్ లో మాత్రం బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వచ్చేసింది. ఏపీ, తెలంగాణలో చాలా ఏరియాలో ఈ సినిమా ఇంకా వసూళ్లను రాబట్టాల్సి ఉంది.

అయితే నిన్న విడుదల అయిన అనుష్క నటించిన ‘ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ‘ షారుక్ ఖాన్ ‘ జవాన్ ‘ సినిమాలు రెండిటికీ సూపర్ డూపర్ టాక్ వచ్చేసింది. ఖుషి కి నైజాంలో ముందు అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. సోమవారం నుంచి బ్యాక్ డ్రాప్ అయ్యాయి. ఇప్పుడు జవాన్ కి నైజాంలో బీభత్సమైన టాకు వచ్చేసింది. దీనికి తోడు అనుష్క సినిమా కూడా విడుదలైంది. ఖుషి ఆడుతున్న చాలా స్ర్కీన్లు తగ్గించి జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలకి ఇచ్చేశారు. ఇంకా మరోవైపు ‘ బెదురులంక ‘ లాంటి సినిమాలకు కొన్ని స్క్రీన్లు కంటిన్యూ చేస్తున్నారు..

Samantha vs Anushka shetty

Samantha vs Anushka shetty

Samantha : సమంతను 15 కోట్లకు నిండా ముంచేసిన అనుష్క..!

ఏదేమైనా అనుష్క సినిమాకి కూడా సూపర్ టాక్ రావడం, ఐదు సంవత్సరాల తర్వాత ఆమె వెండితెరపై కనిపించడంతో ఫామిలీ ప్రేక్షకులు అనుష్క అభిమానులు కూడా ఇప్పుడు అనుష్క సినిమాపై మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖుషిని చూడడం కష్టమే అని చెప్పాలి. ఓవర్ ఆల్ గా ఖుషి సినిమాకి 12 నుంచి 15 కోట్ల మధ్యలో నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకి జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ కొన్ని ఏరియాలో నష్టాలు తప్పవని అనుష్క ఎంట్రీ తో సమంతకి పెద్ద దెబ్బ తగిలిందని చెప్పాలి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది