Samantha : ఒకే ఒక్క వైరల్ వీడియోతో.. టాప్ హీరోయిన్‌లు అందరికీ చెక్ పెట్టిన సమంత..!
Samantha : సమంత.. కొద్ది రోజుల క్రితం కేవలం టాలీవుడ్ కే పరిమితమైన ఈ పేరు.. ప్రస్తుతం బాలీవుడ్‌ను దాటి హాలీవుడ్‌ను చేరింది. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ యాక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ పుష్పలో ఐటమ్ సాంగ్‌లో యాక్ట్ చేసి రికార్డులను బద్దలు కొట్టింది. ప్రస్తుతం జనాల్లో ఎవరి నోట విన్న ఊ అంటావా మామా.. ఊఊ అంటావా మామా అనే సాంగే వినిపిస్తుంది. ఈ పాటలో సమంత వేసిన స్టెప్పులకు కుర్రకారు ఫిదా అయింది. ఏమాయ చేసావే మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ముందు నుంచీ గ్లామర్ పైనే కాస్త ఎక్కువే ఫోకస్ పెడుతూ వస్తోంది.
ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫిట్ నెస్ వర్కవుట్స్ చేస్తూ ఆ వీడియోస్‌ను ఫ్యాన్స్ తో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది. ప్రస్తుతం చేతినిండా మూవీస్ తో చాలా బిజీగా ఉన్న ఈ భామ.. తన వ్యాయామాన్ని మాత్రం వాయిదా వేయడం లేదు. సమంత వర్కువట్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్‌చల్ అవుతున్నాయి.ముందుగా 75 కిలోలున్న బరువును ఎత్తిన వీడియోను షేర్ చేసిన సమంత.. హలో 75.. నిన్ను నేను మిస్ చేశాను అంటూ చెప్పుకొచ్చింది. అనంతరం 78 కిలోల బరువు, తర్వాత 80 కిలోల బరువును ఎత్తుతున్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Samantha : 80 కిలోల బరువును అమాంతం ఎత్తుతూ..
ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి. ఇలా బరువులను లిఫ్ట్ చేసేందుకు తన ఫిట్నెస్ ట్రైనర్ జునైద్ షేక్.. సమంతను మరింతగా ప్రోత్సహించారు. 78 కిలోల బరువును ఎత్తుతున్న వీడియోను పోస్ట్ చేసిన సమంత.. నేను రోజు త్వరగా మేల్కొంటాను.. నిన్ను నిరాశపరచాలని నాకు లేదు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అందుకు నవ్వుతున్న ఎమోజీస్ ను జోడించింది. ఈ క్యాప్షన్‌ను తన జిమ్ కోచ్ కోసం రాస్తూ దానిని అతనికి ట్యాగ్ చేసింది సమంత. ఇదిలా ఉండగా సమంత చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్టులే ఉన్నాయి. వాటితో ఆమె బిజీబిజీగా గడుపుతోంది.
View this post on Instagram