Samantha Yashoda : సమంత యశోద లో అతిపెద్ద నెగిటివ్ పాయింట్ ఇదే… థియేటర్ లో కూర్చోవాలని కూడా అనిపించని సీన్ ఇదే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha Yashoda : సమంత యశోద లో అతిపెద్ద నెగిటివ్ పాయింట్ ఇదే… థియేటర్ లో కూర్చోవాలని కూడా అనిపించని సీన్ ఇదే

 Authored By prabhas | The Telugu News | Updated on :11 November 2022,6:20 pm

Samantha Yashoda : భారీ అంచనాల నడుమ రూపొంది నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత యశోద సినిమా కు నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా లోని సమంత యాక్టింగ్ అభిమానులకు ఒకింత నచ్చే విధంగా ఉంది, కానీ సినిమా ఫస్ట్ హాఫ్ అత్యంత దారుణంగా ఉందని.. క్లైమాక్స్ బాబోయ్ కూర్చోలేక పోతున్నాం అన్నట్లుగా ఉంది అంటూ సినిమా ను చూసిన ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. థియేటర్ నుండి బయటకు వస్తున్న ప్రేక్షకులు వాడి పోయిన మొహంతో కనిపించడంతో అసలు మేటర్ ఏంటి అని ప్రశ్నించగా ఫస్టాఫ్ లోనే వచ్చేద్దాం అన్నంత చెత్తగా సినిమా ఉందంటూ కొందరు చెప్పడం ఆశ్చర్యానికి కలిగి గురి చేస్తుంది.

సెకండ్ హాఫ్ లో అయినా సినిమా బాగుంటుందేమో అని ఎదురు చూశాము, కానీ క్లైమాక్స్ బాలేదని ప్రేక్షకులు చెబుతున్నారు. యశోద సినిమా కు అతి పెద్ద మైనస్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ లోని కథ ఏమీ లేక పోవడం అని.. అలాగే సెకండాఫ్ లోని క్లైమాక్స్ మినిమం ఇంట్రెస్ట్ కలిగించడంలో విఫలమైందని రివ్యూలు రాసిన వారు కూడా చెబుతున్నారు. మొత్తానికి సమంత యశోద భారీ అంచనాల నడుమ విడుదలైనప్పటికీ కలెక్షన్స్ నమోదు చేయడంలో వెనకపడే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. సమంత యశోద సినిమాలో సరోగసి నేపథ్యంలోని కథను చూపించిన విషయం తెలిసిందే.

Samantha Yashoda movie Minus points

Samantha Yashoda movie Minus points

డబ్బు అవసరం అయ్యి సరోగసి మధర్ అవ్వడానికి సమంత ఓకే చెప్తుంది. అలా తనలాగే వందలాది మంది సరోగసి మదర్స్ గా అయ్యేందుకు ఓకే చెప్పి ఒక ప్రమాదంలో చిక్కుకుంటున్నారు. ఆ ప్రమాదం ఏంటి, సమంత వారందరిని ఎలా రక్షించింది.. ఇంతకు ఆ ప్రమాదం వెనుక ఉన్న విలన్స్ ఎవరు అనేది సినిమాలో దర్శకులు చూపించే ప్రయత్నం చేశారు. సమంత తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. కానీ దర్శకులు ఈ సినిమాకు న్యాయం చేయలేదనేది టాక్. సమంత అభిమానులు ఇప్పుడు గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న శాకుంతలం సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది