Home » Entertainment » Samnatha Inspiring Quotation
Entertainment

Samnatha : రేపటి కోసం పోరాడాల్సిందే.. సమంత సంచ‌ల‌న పోస్ట్..!

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: October 23, 2021 4:37 pm
Advertisement

Samnatha : సమంత ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఎలాంటి వాతావరణంలోఉందో అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా సమంత ఈ గందరగోళాన్ని వదిలి.. దైవ సన్నిదికి చేరుకుంది. ఛార్ ధామ్ యాత్రలో సమంత ఎంతో ప్రశాంతతను పొందినట్టు కనిపిస్తోంది. తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి ఈ యాత్రకు వెళ్లింది. శిల్పా రెడ్డి, ఆమె ఫ్యామిలీ ఈ యాత్రకు వెళ్తుంటే.. సమంత కూడా జాయిన్ అయినట్టు కనిపిస్తోంది. మొత్తానికి హిమాలయాలను దర్శించుకుని సమంత తిరుగు ప్రయాణం చేస్తోంది.

Advertisement

samnatha inspiring quotation

ఛార్ ధామ్ యాత్ర ఎంతో గొప్పగా జరిగిందని, గంగోత్రి యమునోత్రి కేదార్ నాథ్ బద్రీనాథ్ వంటి ప్రదేశాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని సమంత చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు మహా భారతం చదివిన దగ్గరి నుంచి కూడా హిమాలయాలను చూడాలనే కుతుహలం,కోరిక పెరిగిందట. మొత్తానికి తన కోరిక నెరవేరిందని సమంత ఫుల్ హ్యాపీ అవుతోంది. ఇక ఛార్ ధామ్ యాత్రలోనే సమంత ప్రత్యేక పూజలు కూడా నిర్వహించింది. ఇక ఇప్పుడు హిమనీ క్షేత్రాలు, గంగా యమున సరస్వతి నదులు పుట్టుక గురించి చెప్పే వీడియోలను షేర్ చేసింది.

Advertisement

Samnatha : సమంత కొటేషన్ వైరల్

samnatha inspiring quotation

అయితే తాజాగా అమ్మ చెప్పింది అంటూ సమంత ఓ కొటేషన్ షేర్ చేసింది. ఈ మధ్య మామ్ సెయిడ్ (అమ్మ చెప్పింది #MOMSAID) అంటూ కొన్ని కొటేషన్లను షేర్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సమంత ఓ సూక్తిని షేర్ చేసింది. ఈ రోజు, ఇప్పుడు నీకు ఏది ఉందో దాంట్లో తృప్తి పడు అది ఉన్నందుకు రుణపడి ఉండు.. ఇక రేపటి గురించి నీ ఆశలు ఏంటి? నీ కల ఏంటో దానికి గురించి పోరాడుతూ ఉండు అని చెప్పుకొచ్చింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి