
Harish rao New twist in huzurabad bypoll
Harish rao : కరీంనగర్ : హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపునకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పరోక్ష సహకారం. అదేంటి అనుకుంటున్నారా? లేదా ఆ.. వాళ్లిద్దరూ పాత స్నేహితులే అయ్యుండొచ్చులే అనుకుంటున్నారా? ఏమో మరి.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న హరీశ్ ఫోటోలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికకు సరిగ్గా వారం రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది.
Harish rao New twist in huzurabad bypoll
ఆయా రాజకీయ పార్టీల వాడీవేడీ ప్రచారం తారాస్థాయికి చేరింది. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోరుతూ ఓ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు డప్పు వాయించారు. ఎన్నికల ప్రచారంలో ఇదంతా కామనే అంటారా. చాయ్ దుకాణానికి పోయి చాయ్ అమ్మడం, ఇస్త్రీ షాపుకు పోయి బట్టలు ఇస్త్రీ చేయడం, మురికి వాడలకు పోయి చిన్నపిల్లలకు స్నానాలు చేయించడం, తోపుడు బండ్లవద్దకు పోయి పండ్లు, కూరగాయలు అమ్మడం, ధూం.. ధాం కార్యక్రమంలో డప్పు వాయింపులు సహజమే అంటారా.. అవును.. అదంతా కామనే.. కానీ హరీశ్ డప్పు వాయింపు మాత్రం భిన్నం. ఎందుకంటారా.. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు అని రాసి బీజేపీ గుర్తు స్పష్టంగా ఉన్న డప్పు చేబూని హరీశ్ వాయించాడు.
Harish rao New twist in huzurabad bypoll
హరీశ్ మాత్రమే కాదు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, తోటి అనుచరులంతా బీజేపీ డప్పులుబూనీ దండోరా చాటారు. ఈ ఫోటోలే ప్రస్తుతం సోషల్ మీడియా, వాట్సప్‌లలో చక్కర్లు కొడుతున్నాయి. హరీశ్ మద్దతు ఈటలకేనా అంటూ జోకులు ప్రచారం అవుతున్నాయి. అయితే బీజేపీ సోషల్ మీడియా వింగ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి బీజేపీ గుర్తులతో ఉన్న డప్పులను ప్రచారంలోకి తెచ్చినట్లు టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.