Samyuktha Menon : గురూజీ వెంటపడుతున్న మలయాళీ భామ..?

Authored By vamana sai | The Telugu News | Published on: April 6, 2022, 11:00 am

Samyuktha Menon: గురూజీ వెంటపడుతున్న మలయాళీ భామ..? అంటూ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ హాట్‌గా చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఎవరా మలయాళీ భామ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ సినిమా భీమ్లా నాయక్ సినిమాతో మలయాళ ఇండస్ట్రీ నుంచి తెలుగుకు దిగుమతి అయిన ముద్దుగుమ్మ. ఈ సినిమాలో నిత్యా మీనన్‌తో పాటు సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ మూవీకి దర్శకుడు సాగర్ కె చంద్ర అయినప్పటికీ దాదాపుగా క్రెడిట్ మొత్త దక్కింది మాత్రం మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కే. మలయాళంలో మంచి కమర్షియల్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా చూసిన నిర్మాతలు త్రివిక్రమ్ కి చెప్పగా.. ఆయన వెంటనే రైట్స్ తీసుకోమని సలహా ఇచ్చారు.ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌లో పవన్ కళ్యాణ్‌ను తీసుకొచ్చే దగ్గర్నుంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే వరకూ అన్నీ తానై చూసుకున్నాడు.

అయితే, త్రివిక్రమ్ సినిమాలలో హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఆయన సినిమాలో నటించిన హీరోయిన్‌కు మంచి క్రేజ్ ఏర్పడి టాలీవుడ్‌లో సెటిలవడమే కాదు, స్టార్ హీరోయిన్‌గా కొన్నేళ్ళపాటు వెలుగుతుంది. అయితే, ఇది ఫస్ట్ హీరోయిన్ విషయంలో మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ లీడ్‌లో త్రివిక్రమ్ సినిమా చేసిన ఏ హీరోయిన్‌కు కలిసి రాలేదని ఆయన సినిమాలలో నటించిన ముద్దుగుమ్మలను చూస్తే అర్థమవుతుంది. అందుకే, దాదాపు అందరు హీరోయిన్లు ఆయన సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా నటించేందుకే ఆరాటపడతారు.ఇక త్రివిక్రమ్ సినిమాలలో ఇప్పటి వరకు నటించిన వారిలో ఎక్కువగా చేసింది సమంత, ఇలియానా, పూజా హెగ్డే పేర్లను చెప్పుకోవచ్చు. ఆయన ఒక్కసారి హీరోయిన్‌ను ఫిక్స్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఆమెనే రిపీట్ చేస్తుంటారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది.

Samyuktha Menon: గురూజీకి ఈ మలయాళీ భామ పర్ఫార్మెన్స్ నచ్చిందో లేదో..!

టాక్ విషయం పక్కనపెట్టి ఆయన సినిమాలలో నటించిన హీరోయిన్స్‌ను పరిశీలిస్తే ఈ విషయం క్లియర్‌గా తెలుస్తుంది. ఇలియానాతో జల్సా, జులాయి సినిమాలు చేశారు. సమంతతో అత్తారింటికి దారేది, అ..ఆ, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలు చేశారు. అందరూ గురూజీ అని పిలుచుకునే ఆయన ఆ తర్వాత పూజా హెగ్డేతో కంటిన్యూగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలతో పూజాకు భారీ హిట్స్ ఇచ్చారు గురూజీ. ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయబోతున్న సినిమాలోనూ పూజా హెగ్డే హీరోయిన్. ఈ క్రమంలోనే మలయాళీ భామ సంయుక్త మీనన్ భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ తర్వాత ఎక్కువగా ఆయనతో టచ్‌లో ఉంటుందట. ఇప్పుడు దర్శకుడిగా మాత్రమే కాక నిర్మాతగానూ మారి సినిమాలు నిర్మిస్తున్నారు. అందుకే, ఈ మలయాళీ భామ గురూజీ వెంటపడి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో అవకాశాలివ్వమని అడుగుతోందట. మరి గురూజీకి ఈ మలయాళీ భామ పర్ఫార్మెన్స్ నచ్చిందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp