Sanam Teri Kasam : సనమ్ తేరి కసమ్ రీరిలీజ్.. బాక్సాఫీస్ వద్ద లవ్‌యాపను అధిగమిస్తుందా?
ప్రధానాంశాలు:
Sanam Teri Kasam : సనమ్ తేరి కసమ్ రీరిలీజ్.. బాక్సాఫీస్ వద్ద లవ్‌యాపను అధిగమిస్తుందా?
Sanam Teri Kasam : దాదాపు పదేళ్ల తర్వాత సనమ్ తేరి కసమ్ నేడు థియేటర్లలో తిరిగి విడుదలవుతోంది, ఈ చిత్రం విడుదలైన సమయంలో బాగా ఆడకపోయినా, రీరిలీజ్ సమయంలో ఆశాజనకమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుకు కారణం అడ్వాన్స్ బుకింగ్స్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే 20,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. కొంత మంది అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉందని, దాదాపు 39,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయని పేర్కొన్నాయి.
Sanam Teri Kasam మంచి ఆదరణ..
సరసమైన టికెట్ ధర కారణంగా, ఈ చిత్రం మొదటి రోజున దాదాపు రూ. 2 కోట్లు వసూళ్లు చేస్తుందని అంచనా. రీ రిలీజ్ సినిమా అయినప్పటికీ, సనమ్ తేరి కసమ్ బాక్సాఫీస్ వద్ద కొత్త చిత్రాల కన్నా రికార్డులు క్రియేట్ చేస్తుంది. హిమేష్ రేషమ్మియా యాక్షన్-ప్యాక్డ్ బాదాస్ రవి కుమార్ రూ. 5 కోట్లకు పైగా వసూలు చేస్తుందని అంచనా వేయగా, లవ్‌యాపా రూ. 1–2 కోట్ల మధ్య వసూలు చేస్తుందని అంచనా వేసారు.
హర్షవర్ధన్ రాణే మరియు పాకిస్తానీ నటి మావ్రా హొకేన్ నటించిన సనమ్ తేరి కసమ్ మంచి ఆదరణ దక్కించుకుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విజయవంతంగా ప్రదర్శితమైన తర్వాత ఈ సినిమాకి ఆదరణ మరింత పెరిగింది.. ఈ చిత్రానికి రాధిక రావు మరియు వినయ్ సప్రు దర్శకత్వం వహించారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈసారి బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించగలదా అనేది చూడాలి.