Sarath Babu : సీనియర్ నటుడు శరత్ బాబు ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ మృతి చెందటం తెలిసిందే. తెలుగు మరియు తమిళ భాషల్లో అనేక సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా నటించిన ఆయన… నటుడిగా మంచి గుర్తింపు పొందడం జరిగింది. ఈ క్రమంలో ఆయన చివరి కోరిక గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ చివరి కోరిక ఏమిటంటే శరత్ బాబుకు హార్సిలీ హిల్స్ ప్రాంతం అంటే చాలా ఇష్టం అంట.
ఆ ప్రాంతంలో స్థిరపడాలి అనేది ఆయన కోరిక. 1985లో ఆయనకు కొండపై మానస సరోవరం ఇంటి స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ స్థలంలో అప్పట్లో ఇంటి నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరిగింది. అయితే అది అప్పట్లో పూర్తి కాలేదు. దీనితో చివర ఆఖరికి శరత్ బాబు కోరిక నెరవేరకుండానే ఆయన మృతి చెందటం జరిగింది. ఇదిలా ఉంటే ఈనెల 26వ తారీఖున విడుదలకు సిద్ధం కాబోతున్న “మళ్లీ పెళ్లి”లో శరత్ బాబు కీలక పాత్ర చేశారు.

నరేష్…. పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాయే శరత్ బాబుకి చివరి సినిమా. సరిగ్గా విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో శరత్ బాబు మరణం ఇండస్ట్రీలో అందరినీ కలచివేసింది. ఆయన మరణం పట్ల దేశ ప్రధానితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినీ ప్రముఖులు ఎంతోమంది సంతాపం వ్యక్తం చేశారు. నిన్ననే చెన్నైలో శరత్ బాబు అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.