Bigg Boss 5 Telugu : నీ పుట్టలో వేలు పెట్టదల్చుకోలేదు.. వామ్మో సరయు మొదలుపెట్టేసింది!
Bigg Boss 5 Telugu యూట్యూబర్ సరయు అంటే ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. పక్కా బూతులు మాట్లాడగలిగిని అమ్మాయి. యూట్యూబ్‌లో మింగుడు అనే పదానికి సరయు పర్యాయపదంగా మారిపోయింది. అంతటి దారుణమైన పదాలను వాడగలిగిన బ్యూటీని బిగ్ బాస్ టీం ఎంచుకుంది. అంటే బిగ్ బాస్ 5 తెలుగు టీం ఏం ఆశించి ఉంటుందో అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టే స్టేజ్ మీద మొదటి రోజే నాగార్జునతో మింగుడు కథను ప్రారంభించింది. అలాంటి మింగుడు పదాలతో సరయు […]
Bigg Boss 5 Telugu యూట్యూబర్ సరయు అంటే ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. పక్కా బూతులు మాట్లాడగలిగిని అమ్మాయి. యూట్యూబ్‌లో మింగుడు అనే పదానికి సరయు పర్యాయపదంగా మారిపోయింది. అంతటి దారుణమైన పదాలను వాడగలిగిన బ్యూటీని బిగ్ బాస్ టీం ఎంచుకుంది. అంటే బిగ్ బాస్ 5 తెలుగు టీం ఏం ఆశించి ఉంటుందో అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టే స్టేజ్ మీద మొదటి రోజే నాగార్జునతో మింగుడు కథను ప్రారంభించింది.
అలాంటి మింగుడు పదాలతో సరయు బిగ్ బాస్ 5 తెలుగు ఆటలో ఇంకెన్ని వివాదాలు క్రియేట్ చేస్తుందో అని అందరూ అనుకున్నారు. కానీ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాక మాత్రం సరయు కాస్త సైలెంట్‌గానే ఉంటుంది. నిన్నటి కెప్టెన్సీ టాస్కులో సరయు రెచ్చిపోయింది. విశ్వకు సరయు సపోర్ట్ చేసింది.. అదే సమయంలో ఆర్జే కాజల్ మాత్రం విశ్వను ఓడగొట్టేందుకు ప్రయత్నించింది.
నీ పుట్టలో వేలు పెట్టదల్చుకోలేదు.. వామ్మో సరయు మొదలుపెట్టేసింది ! Bigg Boss 5 Telugu
ఆడవాళ్లు గెలవాలని చెప్పిన ఆర్జే కాజల్.. మానస్‌ను మాత్రం టార్గెట్ చేయకపోవడంపై కాజల్‌ను ప్రశ్నించింది సరయు. కేవలం విశ్వను మాత్రమే డిస్టర్బ్ చేయడంపై సరయు చిందులు తొక్కింది. చివరకు ఈ వాగ్వాదం పెరిగిపోతోండటంతో కాజల్‌కు సరయు దండంపెట్టేసింది.
నీ పుట్టలో వేలు పెట్టదల్చుకోలేదు అని సరయు తన స్టైల్లో కౌంటర్ వేసింది. ఇక దానికి మీనింగ్ అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా విడమరిచి చెప్పాల్సిన పని లేదు.