lady YouTuber : ప్రియుడి మోజులో పడి ఏ భార్య చేయని పనిచేసిన లేడీ యూట్యూబర్..!
lady YouTuber : సోషల్ మీడియా పుణ్యమా అని వెలుగులోకి వచ్చిన యూట్యూబర్ రవీనా, ప్రస్తుతం హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా జైలులో ఉండటం చర్చనీయాంశంగా మారింది. హర్యానా రాష్ట్రం భివానీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2017లో ప్రవీణ్‌తో వివాహం అయిన రవీనా, ఓ ఆరేళ్ల అబ్బాయికి తల్లిగా ఉన్నా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేది. రెండేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సురేష్ అనే మరో యూట్యూబర్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం అటుఅటుగా ప్రేమగా మారి, రవీనా జీవితంలో కొత్త మలుపు తిప్పింది.

lady YouTuber : ప్రియుడి మోజులో పడి ఏ భార్య చేయని పనిచేసిన లేడీ యూట్యూబర్..!
lady YouTuber : ఇన్ స్టాలో పరిచమైన యువకుడితో ప్రేమాయనం.. అడ్డుగా ఉన్న భర్తను హత్య
రవీనా, సురేష్ కలిసి వీడియోలు చేయడం ఫ్యామిలీ సభ్యులకు ఏమాత్రం నచ్చలేదు. ఇదే విషయంపై ఆమె భర్త ప్రవీణ్‌తో తరచూ గొడవలు జరిగేవి. వీడియోలు, ప్రేమాయణం వల్ల ఇప్పటికే మనశ్శాంతి కోల్పోయిన ప్రవీణ్, మద్యం అలవాటుతో బాధపడేవాడు. మార్చి 25న రవీనా ఇంటికి వచ్చిన సురేష్‌ను చూసిన ప్రవీణ్.. తీవ్రంగా ఆగ్రహించాడు. ఘర్షణ అనంతరం అదే రోజు రాత్రి రవీనా, సురేష్ కలిసి ప్రవీణ్‌ను గొంతుకోసి హత్య చేశారు. అనంతరం ఆయన మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి కాల్వలో పడేశారు. సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలు రికార్డవ్వడంతో హత్య కేసు మలుపు తిరిగింది.
ప్రవీణ్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజులకే అతడి మృతదేహం లభించడంతో పోలీసులు సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో రవీనా నేరాన్ని అంగీకరించడంతో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పరారీలో ఉన్న సురేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.