YouTuber : యూట్యూబర్ అతి సాహసం.. అమాంతం 100 పచ్చి గుడ్లను ఒకేసారి త్రాగడంతో ..!!?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YouTuber : యూట్యూబర్ అతి సాహసం.. అమాంతం 100 పచ్చి గుడ్లను ఒకేసారి త్రాగడంతో ..!!??

 Authored By aruna | The Telugu News | Updated on :19 November 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  YouTuber : యూట్యూబర్ అతి సాహసం..

  •  అమాంతం 100 పచ్చి గుడ్లను ఒకేసారి త్రాగడంతో

YouTuber : కోడిగుడ్డు పోషకాల గని అంటారు. అందుకే ప్రతిరోజు ఒక కోడి గుడ్డును తింటే చాలా మంచిదని వైద్యులు చెబుతుంటారు. గుడ్డులో ప్రోటీన్స్, మినరల్స్, శరీరానికి కావలసిన పోషకాలు ఉంటాయి. అందుకే పౌష్టికాహారం లోపం అధిగమించాలి అంటే రోజు తీసుకునే ఆహార పదార్థాలలో ముఖ్యమైనది కోడిగుడ్డు. దీంతో చాలామంది రోజువారి ఆహారంలో కోడిగుడ్డును చేర్చుకోవడం చాలా కామన్. ఈ క్రమంలోనే కొందరు ఉడికించిన గుడ్డును తింటే మరికొందరు పచ్చి గుడ్లను త్రాగేస్తుంటారు.

అయితే ఇలా ఒకటి రెండు కోడిగుడ్డు తాగితే పర్లేదు కానీ ఓ యూట్యూబర్ మాత్రం 100 పచ్చి గుడ్లను ఒకేసారి త్రాగేసాడు. తన యూట్యూబ్ ఛానల్ కు లక్ష ఫాలోవర్స్ అయిన ఆనందంలో అతడు ఇలా సాహసోపేత పనిచేసి సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. ఫిట్నెస్ ట్రైనర్ అయిన విన్స్ ఇయానోన్ తన యూట్యూబ్ ఛానల్ కు లక్ష ఫాలోవర్స్ వచ్చిన సంతోషంలో ఈ సాహసం చేశాడు. జిమ్లో వ్యాయామం చేస్తూ ఈ ఫీట్ ను చేశాడు. తన ఫాలోవర్స్ కోసం ఏదైనా సప్రైజ్ ఇవ్వాలని వెంటనే మగ్గునిండా 100 పచ్చి గుడ్లను నింపాడు. ఎందుకిలా చేస్తున్నాడో వివరిస్తూ మగ్గులోని గుడ్డు మిశ్రమాన్ని త్రాగటం ప్రారంభించాడు.

అలా సగం తాగేసాక కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ త్రాగేసాడు. సగానికి పైగా అయిపోయిన తర్వాత మగ్ ను పక్కకు పెట్టి నాలుగు పుషప్స్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ త్రాగటం ప్రారంభించాడు. అలా కొద్దిసేపటికి గుడ్డు మిశ్రమం మొత్తం త్రాగేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కోడుగుడ్డు శరీరానికి మంచిదే కానీ ఇలా చేస్తే ఆరోగ్యానికి ప్రమాదం అని కామెంట్ చేశారు. శరీరానికి మేలు చేస్తుంది కదా అని గుడ్డును అతిగా తింటే ఆ తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని డాక్టర్లు కూడా చెబుతున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి