Sarkaru Vaari Paata : అన్నీ ఫేక్ కలెక్షన్సేనా..! ఇదిగో ప్రూఫ్ అంటున్నారే..

 Authored By govind | The Telugu News | Updated on :18 May 2022,10:00 pm

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. తాజాగా ఈ మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి వచ్చి వైరల్ అవుతోంది. రిలీజైన రోజు నుంచి ఈ సినిమాకు డివైడ్ టాకె వచ్చింది. అయినా మేకర్స్ మాత్రం భారీ హిట్ అని మహేశ్ కెరీర్‌లోనే అత్యంత వేగంగా వసూళ్ళు రాబట్టిన సినిమా అంటూ ఊదరగొడుతున్నారు. ఇదే ఇప్పుడు కొత్తగా న్యూస్ వచ్చి వైరల్ అవడానికి కారణం అంటున్నారు. సాధారణంగా ఒకపుడు సినిమా రిలీజైన తర్వాత మొదటి ఒకటి రెండు రోజులకే హిట్టా ఫట్టా తేలిపోయేది.

కానీ, ఇప్పుడు అలా కాదు. దొరికింది సోషల్ మీడియా అని ముందు బ్లాక్ బస్టర్, భారీ హిట్ అని జనాలను నమ్మించి థియేటర్స్‌కు రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. జనాలు ఫ్లాప్ అని అంటున్నా కూడా దర్శక, నిర్మాతలు మాత్రం బ్లాక్ బస్టర్ అని పోస్టర్ డిజైన్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఓ నెల తర్వాత నెమ్మదిగా ఆశించిన వసూళ్ళు రాలేదని..సినిమా ఫ్లాపని కన్‌ఫర్మ్ చేసేస్తారు. ఇదొక స్ట్రాటజీ అయిపోయింది. సర్కారు వారి పాట సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుందా..! అనే సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి.

Sarkaru Vaari Paata All fake collections Here is the proof

Sarkaru Vaari Paata All fake collections Here is the proof

Sarkaru Vaari Paata : ఇది పాన్ ఇండియన్ సినిమా కాదు. మిగతా భాషలలో కూడా రిలీజ్ కాలేదు.

దీనికి కారణం ఈ సోమవారం నాటికి కలెక్షన్స్ చాలా వరకు డ్రాపయ్యాయి. ఇది పాన్ ఇండియన్ సినిమా కాదు. మిగతా భాషలలో కూడా రిలీజ్ కాలేదు. కేవలం ఒక్క తెలుగులోనే రిలీజైంది. అయినా ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి రోజు రాబట్టిన రేంజ్‌లో సర్కారు వారి పాట వసూళ్ళు కూడా వచ్చాయని ప్రేక్షకుల్లో పలు సందేహాలు కలుగుతున్నాయి. నిజమే, ఆదివారం తర్వాత సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి జనాలలో పెద్దగా టాక్ వినిపించలేదు. మరి ఇలాంటి సినిమా బ్రేకీవెన్ టార్గెట్ రీచ్ అవడం కష్టమే అంటున్నారు. మరి ఒరిజినల్‌గా వసూళ్ళు ఏ మేరకు వచ్చాయో మేకర్స్ వెల్లడిస్తే గానీ, తెలియదు. ఏదేమైనా ఫైనల్ రన్‌లో సర్కారు వారి పాట టాక్ యావరేజ్ అని డిసైడవుతుందని అంటున్నారు.

govind

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి