Sarkaru Vaari Paata : సెన్సార్ రివ్యూ..పోకిరి 2 అని పెట్టాల్సిందా..?

Authored By vamana sai | The Telugu News | Updated on: May 10, 2022, 10:47 am

Sarkaru Vaari Paata : అటు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఖిలాడి హీరో అక్షయ్ కుమార్ ఏ రేంజ్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఖాన్‌ల త్రయాన్ని వెనక్కి నెట్టి నంబర్ 1 పొజిషన్‌లో కూర్చున్నారో మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ మంచి ఫామ్ లో ఉన్నాడు. ముఖ్యంగా మహేశ్ ఎక్కువగా సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకొని దర్శక, రచయితలు తయారు చేస్తున్న కథలకే సై అంటున్నాడు. కథ, కథనాల విషయంలో మహేశ్ భార్య నమ్రత ఎక్కువగా చొరవ తీసుకుంటుంటుంది. ఆమె గనక కథ భావుంది..అంటే చాలు మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.

అలా కమిటయిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పరశురాం నుంచి వెంటనే సినిమా అనౌన్స్ కాకపోయేసరికి ఎవరీ ఎమీ అర్థం కాలేదు. కానీ, అనూహ్యంగా ఆయన మహేశ్ హీరోగా సర్కారు వారి పాట సినిమాను చేస్తున్నట్టు ప్రకటించగానే..అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఈ కాంబినేషన్ ఎలా సెట్ అయిందీ అని. మొత్తానికి బ్యాంకింగ్ రంగంలో జరిగే ఆర్థిక కుంభకోణాల నేపథ్యం అనగానే మహేశ్ కూడా చాలా ఎగ్జైటింగ్‌గా సర్కారు వారి పాట పాడేందుకు రెడీ అయిపోయారు. హీరోయిన్‌గా కీర్తి సురేశ్‌ను ఎంపిక చేసుకున్న దర్శకుడు మహేశ్ – కీర్తిల మధ్య మంచి లవ్ ట్రాక్‌ను కూడా క్రియేట్ చేశాడు.

Sarkaru Vaari Paata Censor Review

Sarkaru Vaari Paata Censor Review

Sarkaru Vaari Paata: పోకిరి 2 అని పెట్టొచ్చనే మాట కూడా చెప్పినట్టు టాక్..

సినిమాలో ఇది చాలా హైలెట్ అవుతుందని దర్శకుడు చాలా నమ్మకంగా చెబుతున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 162 నిమిషాల 25 సెకన్ల నిడివితో యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమాకు సెన్సార్ రిపోర్ట్ అదిరిపోయింది. చిత్రాన్ని సెన్సార్ చేసిన సభ్యులు బ్లాక్ బస్టర్ అని చెప్పారట. అంతేకాదు, సర్కారు వారి పాట టైటిల్ కాకుండా అయితే పోకిరి 2 అని పెట్టొచ్చనే మాట కూడా చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. దీనినిబట్టి చూస్తే మేకర్స్ ముందు నుంచీ చెప్పుకొస్తున్న పోకిరి వైబ్స్ సర్కారు వారి పాట సినిమాకు కనిపిస్తాయని అర్థమవుతోంది. మరి మే 12న రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp