Sarkaru Vaari Paata Movie First Day Collections
Sarkaru vaar paata : సూపర్ స్టార్ మహేష్ బాబు మానియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలపై అంచనాలు ఏం రేంజ్‌లో ఉంటాయో మనందరికి తెలిసిందే.తాజగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం బాక్సాఫీస్ స్టామినాకి ఏమాత్రం తగ్గకుండా భారీ స్థాయి వసూళ్లను కొల్లగొడుతుంది. ఆల్రెడీ నాన్ RRR రికార్డులతో నైజాం లో ఖాతా తెరవగా ఇప్పుడు టోటల్ ఏపీ తెలంగాణాలో కూడా నాన్ RRR ఓపెనింగ్స్ అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ మొదటి రోజే ఈ చిత్రం సెన్సేషనల్ ఓపెనింగ్ 36.63 కోట్ల షేర్ ని అందుకొని బాక్సాఫీస్ దగ్గర ఫైర్ చూపించింది. ఇక ఏరియాల వారీగా వచ్చిన వసూళ్ల షేర్ వివరాలు చూసినట్టు అయితే..
నైజాం – 12.24 కోట్లు
సీడెడ్ – 4.7 కోట్లు
ఉత్తరాంధ్ర – 3.73 కోట్లు
తూర్పు గోదావరి – 3.25 కోట్లు
పశ్చిమ గోదావరి – 2.74 కోట్లు
గుంటూరు – 5.83 కోట్లు
కృష్ణ – 2.58 కోట్లు
నెల్లూరు – 1.56 కోట్లు
Sarkaru Vaari Paata Movie First Day Collections
మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట 36.63 కోట్ల షేర్ ని కొల్లగొట్టి అదరగొట్టింది. మార్చి 25న విడుదలైన ట్రిపుల్ ఆర్ సినిమాకు మొదటి రోజు ఏపీ తెలంగాణలో ఏకంగా రూ. 74.11 కోట్ల షేర్ వచ్చింది. బాహుబలి 2 పేరు మీదున్న రూ. 43 కోట్ల రికార్డును ఏకంగా రూ. 31 కోట్ల తేడాతో కొట్టేసింది. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన సైరా సినిమా మొదటి రోజే రూ. 38.75 కోట్లు షేర్ వసూలు చేసింది. ఆ సినిమాపై అంచనాల దృష్ట్యా సైరా రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది.
బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో మొదటి రోజే రూ. 36.52 కోట్లు షేర్ వసూలు చేసింది. ఆ తర్వాత పడిపోయింది సాహో. మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 32.77 కోట్లు షేర్ వసూలు చేసింది. అయితే పరశురామ్ దర్శకత్వంలో నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా మొదటి రోజు తెలంగాణ, ఏపీలో మంచి వసూళ్లనే సాధించింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 36.63 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్‌గా ఐదో స్థానంలో నిలిచింది.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.