Sarkaru Vaari Paata : తెలుగు స్టేట్స్‌లో దంచి కొట్టిన స‌ర్కారు వారి పాట‌.. ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్ ఎన్ని అంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sarkaru Vaari Paata : తెలుగు స్టేట్స్‌లో దంచి కొట్టిన స‌ర్కారు వారి పాట‌.. ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్ ఎన్ని అంటే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :13 May 2022,12:00 pm

Sarkaru vaar paata : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మానియా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమాల‌పై అంచ‌నాలు ఏం రేంజ్‌లో ఉంటాయో మ‌నంద‌రికి తెలిసిందే.తాజ‌గా మహేష్ బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట చిత్రం బాక్సాఫీస్ స్టామినాకి ఏమాత్రం తగ్గకుండా భారీ స్థాయి వసూళ్లను కొల్లగొడుతుంది. ఆల్రెడీ నాన్ RRR రికార్డులతో నైజాం లో ఖాతా తెరవగా ఇప్పుడు టోటల్ ఏపీ తెలంగాణాలో కూడా నాన్ RRR ఓపెనింగ్స్ అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ మొదటి రోజే ఈ చిత్రం సెన్సేషనల్ ఓపెనింగ్ 36.63 కోట్ల షేర్ ని అందుకొని బాక్సాఫీస్ దగ్గర ఫైర్ చూపించింది. ఇక ఏరియాల వారీగా వచ్చిన వసూళ్ల షేర్ వివరాలు చూసినట్టు అయితే..

నైజాం – 12.24 కోట్లు
సీడెడ్ – 4.7 కోట్లు
ఉత్తరాంధ్ర – 3.73 కోట్లు
తూర్పు గోదావరి – 3.25 కోట్లు
పశ్చిమ గోదావరి – 2.74 కోట్లు
గుంటూరు – 5.83 కోట్లు
కృష్ణ – 2.58 కోట్లు
నెల్లూరు – 1.56 కోట్లు

Sarkaru Vaari Paata Movie First Day Collections

Sarkaru Vaari Paata Movie First Day Collections

మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట 36.63 కోట్ల షేర్ ని కొల్లగొట్టి అదరగొట్టింది. మార్చి 25న విడుదలైన ట్రిపుల్ ఆర్ సినిమాకు మొదటి రోజు ఏపీ తెలంగాణలో ఏకంగా రూ. 74.11 కోట్ల షేర్ వచ్చింది. బాహుబలి 2 పేరు మీదున్న రూ. 43 కోట్ల రికార్డును ఏకంగా రూ. 31 కోట్ల తేడాతో కొట్టేసింది. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన సైరా సినిమా మొదటి రోజే రూ. 38.75 కోట్లు షేర్ వసూలు చేసింది. ఆ సినిమాపై అంచనాల దృష్ట్యా సైరా రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది.

బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో మొదటి రోజే రూ. 36.52 కోట్లు షేర్ వసూలు చేసింది. ఆ తర్వాత పడిపోయింది సాహో. మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 32.77 కోట్లు షేర్ వసూలు చేసింది. అయితే పరశురామ్ దర్శకత్వంలో నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా మొదటి రోజు తెలంగాణ, ఏపీలో మంచి వసూళ్లనే సాధించింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 36.63 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్‌గా ఐదో స్థానంలో నిలిచింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది