Sarkaru Vari Paata : ఏడేళ్ళ తర్వాత మహేష్ బాబు ఛాన్సిస్తే ..ఆయనకే షాకిచ్చిన తమన్..?
Sarkaru Vari Paata : తమన్ నామ జపమే గత కొన్నేళ్ళుగా మన టాలీవుడ్ స్టార్ హీరోలందరూ జపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డార్లింగ్ ప్రభాస్, బాలయ్య, రవితేజ నుంచి నేచురల్ స్టార్ నానీ వరకూ అందరికి తమన్ భయ్యా వాయింపుడే కావాలి..అన్నట్టుగా క్రేజ్ తెచ్చుకున్నాడు మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ తమన్. అరవింద సమేత, అలవైపుకుంఠపురములో, వకీల్ సాబ్, భీమ్లా నాయక్, అఖండ, క్రాక్, గని, ఇటీవల వచ్చిన సర్కారు వారి పాట..మధ్యలో రాధే శ్యామ్ సినిమాకు బీజీఎం ..ఇలా చేతిలో పట్టకపోయినా సినిమాలను పట్టుకుంటున్నాడు.
దాంతో అన్నీ విధాలుగా తమన్ రేంజ్ స్కై లెవల్‌లో నిలిచింది. అయితే, తమన్ భయ్యాది కాపీ ట్యూన్స్ అని ట్రోల్ జరగడం దానికి ఆయన క్లారిటీ ఇస్తూ రావడం కూడా ఒకవైపు నుంచీ జరుగుతూ వస్తోంది. అందుకే కొందరు నెటిజన్స్ మన తమన్ భయ్యాను కాపీ క్యాట్ అని కూడా పిలుచుకుంటున్నారు. అయితే, సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలకు తమన్ సంగీతం అందించి దాదాపు 9 ఏళ్ళు కావస్తుంది. రెండేళ్ళ క్రితం మొదలైంది సర్కారు వారి పాట. ఆ లెక్కన చూస్తే ఏడేళ్ళ తర్వాత మహేశ్ సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం అందుతుకున్నాడు తమన్.దాంతో గ్యారెంటీ సూపర్ హిట్ ఆల్బం ఇస్తాడని అభిమానులు భావించారు.

Sarkaru Vari Paata Thaman comments on mahesh babu
Sarkaru Vari Paata : వారి పాటకు తమన్ ఆశించిన స్థాయిలో అవుట్‌పుట్ ఇవ్వలేదా..?
తమన్ ఉన్న దూకుడు చూసి కామన్ ఆడియన్స్ కూడా అదే అనుకున్నారు. గతంలో దూకుడు, ఆగడు లాంటి సాలీడ్ మ్యూజిక్ ఆల్బంస్ ఇచ్చిన తమన్..ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాకు మాత్రం మ్యూజిక్ పరంగా దెబ్బేశాడని చెప్పుకుంటున్నారు. కళావతి అనే ఒక్క పాట మినహా మిగతా ఏ పాట పెద్దగా ఆకట్టుకోలేదు తమన్ భయ్యా. క్రాక్, అఖండ, భీమ్లా నాయక్ సినిమాల రేంజ్‌లో సర్కారు వారి పాట సినిమాకు బీజీఎం ఇవ్వలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక్క మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ తప్ప మిగతా ఎక్కడా కూడా తమన్ మ్యాజిక్ చేయలేదని అంటున్నారు. మొత్తంగా సర్కారు వారి పాటకు తమన్ ఆశించిన స్థాయిలో అవుట్‌పుట్ ఇవ్వలేదని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.