Sathya Dev : టాలెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సత్యదేవ్..
Sathya Dev : టాలెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు యంగ్ హీరో సత్యదేవ్. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా నట వారసులే వచ్చి ఏళ్ళ నుంచి ఏలుతున్న సంగతి తెలిసిందే. చిత్రపరిశ్రమలో స్వయంకృషితో స్టార్‌లుగా ఎదిగిన వారిని వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. మెగాస్టార్ చిరంజీవి.. మాస్ మహారాజ రవితేజ, నాని లాంటి అతి కొద్ది మంది మాత్రమే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నిలబడ్దారు. చిరు తర్వాత ఆయన సోదరులు..వారి కొడుకులు ఇప్పుడు స్టార్స్‌గా వెలుగుతున్నారు. దగ్గుబాటి, నందమూరి, అక్కినేని ఫ్యామిలీ హీరోల గురించి అందరికీ తెలిసిందే.ఇంత మంది బడా ఫ్యామిలీ హీరోలున్నా ఇండస్ట్రీ ఎప్పుడు టాలెంట్ ఉన్న వారినీ ఎంకరేజ్ చేస్తుందనడానికి చాలామంది ఉదాహరణగా చూపించొచ్చు.
వారిలో సత్యదేవ్ ఒకడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి ప్రధాన పాత్రలో నటించిన జ్యోతి లక్ష్మి సినిమాలో నటించి సత్యదేవ్ బాగా పాపులర్ అయ్యాడు. పూరి జగన్నాథ్ ఈ సినిమాలో చూపించిన విధానానికి ఈ యంగ్ హీరోకి బాగానే గుర్తింపు దక్కింది. ఆ తర్వాత పూరి దర్శకత్వంలోనే వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మరో స్థాయి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాతో ఏకంగా చిరంజీవి దృష్ఠిలో పడి ఆయన సినిమాలో అవకాశం అందుకున్నాడు.తిమ్మరుసు, బ్రోచేవారెవరురా, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య, స్కై ల్యాబ్ లాంటి సినిమాలు సత్యదేవ్‌ను ఇండస్ట్రీలో బాగా పాపులర్ వచ్చేలా చేశాయి. ఇక ఇటీవల కాలంలో ఈ యంగ్ హీరో తమిళ హీరోలు నటించిన తెలుగు డబ్బింగ్ సినిమాలకు తన గాత్రాన్ని అందిస్తూ కూడా బాగా పాపులర్ అయ్యాడు.
Sathya Dev : ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకండా చిన్న అవకాశాలు దక్కించుకోవడమే చాలా కష్టం.
ఇలా కూడా సత్యదేవ్ సంపాదన బాగా ఉంటోంది. ఇలా ఒకవైపు హీరోగా నటిస్తున్న సత్యదేవ్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ మారి బిజీ అయ్యాడు.అంతేకాదు, ఇప్పుడు ఏకంగా నిర్మాతగా కూడా మారాడు. ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకండా చిన్న చిన్న అవకాశాలు దక్కించుకోవడమే చాలా కష్టం. అలాంటిది సత్యదేవ్ ఇలాంటి చిన్న చిన్న పాత్రలతోనే ఇప్పుడు సినిమాను సొంతంగా నిర్మించే స్థాయికి వచ్చాడు. తన పేరు మీదే నిర్మాణ సంస్థను స్థాపించి మొదటి ప్రయత్నంగా ఫుల్‌బాటిల్ అనే సినిమాను నటిస్తూ నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాను ప్రకటిస్తూ ఫస్ట్ పోస్టర్‌ను వదిలారు. ఇందులో సత్యదేవ్ ఆటో డ్రైవర్‌గా – తాగుబోతు పాత్రలో నటిస్తుండటం విశషం. మరి నటుడిగా సక్సెస్ అయిన సత్యదేవ్ నిర్మాతగా ఏమేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.