see how vikramarku child artist is now
Vikramarku Child Artist : రాజమౌళి సినిమాల్లో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం విక్రమార్కుడు. ఆ సినిమా గుర్తుకువస్తే చాలు అందులో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కచ్చితంగా చర్చకు వస్తుంది. ఎందరో మహా మహుల నటనతో పాటు చైల్డ్ ఆర్టిస్టులు కూడా తమదైన శైలితో ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. తక్కువ సినిమాలు చేసినప్పటికీ వారి మాటలు, చేష్టలతో ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే చైల్డ్ ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు. లిటిల్ సోల్జర్స్ లో నటించిన కావ్య, గంగోత్రి లో నటించిన మరో చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య, డాడీ చిత్రంలో నటించిన అనుష్క అలాంటి వారు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ జాబితాలోనే విక్రమార్కుడు ఫేమ్ నేహా తోట వచ్చింది.
విక్రమార్కుడు సినిమాకు చైల్డ్ ఆర్టిస్ట్ కోసం రాజమౌళి ఆడిషన్స్ నిర్వహిస్తుంటే అందరూ పిల్లలు అల్లరి చేస్తున్నారట. అయితే నేహా మాత్రం ఒకచోట కామ్ గా కూర్చుందట. ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర కూడా అలాగే ఉండడంతో రాజమౌళి వెంటనే ఆమెను సెలెక్ట్ చేశాడట. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. తన అమాయకత్వంతో సినిమాలో ఆఫర్ కొట్టేసిన నేహా తర్వాత అదే నటనతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్ష సినిమాలో దయ్యం పట్టిన పిల్లగా నటించి అందరిని అలరించింది. రక్షా సినిమాలో నటించింది విక్రమార్కుడు నటించిన నేహా ఇద్దరు ఒకరేనా అన్న సందేహం ప్రేక్షకులకు కలిగింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు వచ్చినా వాటిని తిరస్కరించి పూర్తిగా స్టడీస్ పైనే కాన్సన్ట్రేషన్ చేసింది ఈ అమ్మాయి.
see how vikramarku child artist is now
ప్రస్తుతం ఫ్లోరిడాలో బిజినెస్ మేనేజ్మెంట్ MBA చదువుతుంది ఈ చైల్డ్ ఆర్టిస్ట్. సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్ గా ఉండటంతో సినిమాలో ఎందుకు నటించడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. స్టడీస్ పూర్తయ్యాక సినిమా అవకాశాలు వస్తే చేస్తానని, సినిమాల్లో చేయడానికి ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది ఆ చిన్నారి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ చర్చ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అమ్మాయి విక్రమార్కుడు చైల్డ్ ఆర్టిస్టా అంటూ నెటిజన్లు అవాక్కవుతున్నారు. కమల్ హాసన్, రాశి, తరుణ్, బాలాదిత్య లాంటి వారు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కెరీర్ ప్రారంభించి ఇండస్ట్రీ గర్వించదగ్గ నటీ,నటుల అయ్యారు.
see how vikramarku child artist is now
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
This website uses cookies.