Sekhar Master : అందుకే ఢీ షో మానేశా.. మల్లెమాల నాకు పుట్టిళ్లు అంటూ శేఖర్ మాస్టర్ ఎమోషనల్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: April 19, 2022, 5:30 pm

Sekhar Master : శేఖర్ మాస్టర్‌ను ప్రేక్షకులకు ఇంత దగ్గరయ్యేలా చేసింది మల్లెమాల సంస్థ. ఢీ షోలో కంటెస్టెంటుగా మొదలుపెట్టిన ప్రయాణం ఇప్పుడు అక్కడే న్యాయ నిర్ణేతగా ఎదిగేంత వరకు వచ్చింది. మొత్తానికి ఢీ షోకి చాలా సీజన్లే జడ్జ్‌గా వ్యవహరించాడు శేఖర్ మాస్టర్. మరి మల్లెమాలతో ఏం విబేధాలు వచ్చాయో.. ఢీ టీంతో ఎలాంటి గొడవలు వచ్చాయో తెలియదు గానీ.. మొత్తానికి అక్కడి నుంచి బయటకు వచ్చాడు.టైం సరిపోవడం లేదు..

సినిమాల వల్లే ఢీ షోను మానేశాను అంటూ ఇది వరకు చాలా సార్లే క్లారిటీ ఇచ్చాడు. కానీ అసలు విషయం వేరే ఉందంటూ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి మరోసారి శేఖర్ మాస్టర్ ఈ విషయాల మీద స్పందించాడు. ఢీ షోను వీడిపోవడానికి గల కారణాన్ని చెప్పేశాడు. దానికి కారణం అగ్రిమెంట్ అని చెప్పేశాడు.కామెడీ స్టార్స్ అనే షోకు ముందే అగ్రిమెంట్ ఇచ్చేశా అందుకే అక్కడకు వెళ్లాను.. అది ఒక వేళ అయిపోతే మళ్లీ ఢీ వాళ్లు పిలిస్తే వెళ్తానేమో..

Sekhar Master On Quitting Dhee Show And Mallemala

Sekhar Master On Quitting Dhee Show And Mallemala

అంతే కానీ ఢీ షోను మానేయడానికి ప్రత్యేకంగా కారణాలంటూ ఏమీ లేవు.. నన్ను ఇంత మంది దగ్గరకు చేసింది మల్లెమాల, ఢీ షో. అవంటే నాకు ఎప్పటికీ గౌరవమే ఉంటుంది.. ఎప్పుడైనా సరే అందులో చేయడానికి రెడీగానే ఉంటాను.ఢీ షోను డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతోనే మానేయాల్సి వచ్చింది.. అంటూ అసలు విషయం చెప్పేశాడు. మొత్తానికి శేఖర్ మాస్టర్ ప్రస్తుతం ఆచార్య భలే భలే బంజారా పాటతో వైరల్ అవుతున్నాడు. రామ్ చరణ్, చిరంజీవి ఇద్దరితో కలిసి ఇలా ఫుల్ సాంగ్‌ను కొరియోగ్రఫీ చేసేశాడు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp