Sekhar Master : పండు మొహం మాడిపోయింది.. శేఖర్ మాస్టర్ మామూలోడు కాదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sekhar Master : పండు మొహం మాడిపోయింది.. శేఖర్ మాస్టర్ మామూలోడు కాదు

Sekhar Master : ఢీ కంటెస్టెంట్ పండు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఢీ షోలో డ్యాన్సర్‌గా వచ్చిన పండు.. ఇప్పుడు కొరియోగ్రఫర్‌గా మారిపోయాడు. మొత్తానికి పండు మాత్రం నటుడిగా, డ్యాన్సర్‌గా ఆకట్టుకుంటున్నాడు. అయితే అక్కడా ఇక్కడా అని కుదురుగా ఉండడు. ఎప్పుడు ఎక్కడ కనిపిస్తాడో చెప్పలేం. కొన్ని రోజులు జబర్దస్త్ షోలో ఉంటాడు.. మధ్యలో శ్రీదేవీ డ్రామా కంపెనీలో కనిపిస్తాడు.. ఇంకొన్ని సార్లు స్టార్ మాలో వస్తాడు. మొత్తానికి పండు మాత్రం అక్కడా ఇక్కడా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :2 June 2022,8:20 am

Sekhar Master : ఢీ కంటెస్టెంట్ పండు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఢీ షోలో డ్యాన్సర్‌గా వచ్చిన పండు.. ఇప్పుడు కొరియోగ్రఫర్‌గా మారిపోయాడు. మొత్తానికి పండు మాత్రం నటుడిగా, డ్యాన్సర్‌గా ఆకట్టుకుంటున్నాడు. అయితే అక్కడా ఇక్కడా అని కుదురుగా ఉండడు. ఎప్పుడు ఎక్కడ కనిపిస్తాడో చెప్పలేం. కొన్ని రోజులు జబర్దస్త్ షోలో ఉంటాడు.. మధ్యలో శ్రీదేవీ డ్రామా కంపెనీలో కనిపిస్తాడు.. ఇంకొన్ని సార్లు స్టార్ మాలో వస్తాడు. మొత్తానికి పండు మాత్రం అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా దూసుకుపోతోన్నాడు. కానీ ఇప్పుడు పూర్తిగా స్టార్ మాలోని కామెడీ స్టార్స్ ధమాకాలోనే కనిపిస్తున్నాడు.

అంతకు ముందు అయితే జీ తెలుగులో వచ్చిన అదిరింది షోలో సందడి చేశాడు. నాగబాబు ఎక్కడుంటే అక్కడికే పండు వచ్చేస్తుంటాడు. అలా ఇప్పుడు నాగబాబు కామెడీ స్టార్స్ షోలో సందడి చేస్తున్నాడు. దీంతో పండు కూడా అక్కడికే వచ్చాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో పండు మొహం మాడిపోయింది. శేఖర్ మాస్టర్, నాగబాబు ఇద్దరూ కూడా పండు మీద పంచులు వేశారు. దీంతో పండు గాలి తీసినట్టు అయింది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో పండు ఓ నిర్మాతగా నటించాడు. అన్ని కోరికలు తీర్చుకున్నారా.. కానీ ఒక కోరిక మిగిలింది అని పండు అంటాడు. దీంతో నాగబాబు, శేఖర్ మాస్టర్లు కౌంటర్లు వేస్తారు.

sekhar Master Satires on Pandu On Comedy Stars Dhamaka

sekhar Master Satires on Pandu On Comedy Stars Dhamaka

అన్నీ తీర్చుకున్నావా? ఏం ఏం కోరికలురా అని సెటైరికల్‌గా అంటారు. ఇంతకీ ఆ కోరిక ఏంటని అంటే.. శేఖర్ మాస్టర్‌ను పెట్టి ఓ సినిమా తీయాలనుకుంటున్నాను అని చెబుతాడు పండు. ఇక టైటిల్ ఏంటని అడిగితే.. ఉండలేడు.. ఆగలేడు అనే టైటిల్ అంటూ పండు సెటైరికల్‌గా అంటాడు. అలా టైటిల్ చెప్పడంతోనే.. శేఖర్ మాస్టర్ మధ్యలోకి దూరుతాడు. అది నేను కాదురా నువ్వు.. ఆ టైటిల్ నీకు సెట్ అవుతుందని శేఖర్ మాస్టర్ రివర్స్‌లో పంచ్ వేస్తాడు. దీంతో పండు మొహం మాడిపోయినట్టు అయింది. పక్కనున్న నాగబాబు అయితే పగల బడి నవ్వేస్తుంటాడు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది