Sekhar Master : ఫ్యామిలీ అంతా కలిసి ఇలా.. కొడుకు, కూతురితో శేఖర్ మాస్టర్.. వీడియో వైరల్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Sekhar Master : ఫ్యామిలీ అంతా కలిసి ఇలా.. కొడుకు, కూతురితో శేఖర్ మాస్టర్.. వీడియో వైరల్

Sekhar Master : శేఖర్ మాస్టర్ తన ఫ్యామిలీతో ఎంత సరదాగా ఉంటాడో అందరికీ తెలిసిందే. శేఖర్ మాస్టర్ తన కొడుకు విన్ని, కూతురు సాహితీలను తెర మీదకు తీసుకొచ్చాడు. జబర్దస్త్, క్యాష్ షో, పండుగ ఈవెంట్లకు తీసుకొచ్చాడు శేఖర్ మాస్టర్. ఇక విన్ని అయితే.. ఏకంగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు. సైరా సినిమాలో ఓ చిన్న సీన్ చేశాడు. కానీ ప్రభావం మాత్రం గట్టిగానే చూపించాడు. ఇక ఈ మధ్య నాని అంటే సుందరానికీ […]

 Authored By aruna | The Telugu News | Updated on :19 September 2022,7:00 pm

Sekhar Master : శేఖర్ మాస్టర్ తన ఫ్యామిలీతో ఎంత సరదాగా ఉంటాడో అందరికీ తెలిసిందే. శేఖర్ మాస్టర్ తన కొడుకు విన్ని, కూతురు సాహితీలను తెర మీదకు తీసుకొచ్చాడు. జబర్దస్త్, క్యాష్ షో, పండుగ ఈవెంట్లకు తీసుకొచ్చాడు శేఖర్ మాస్టర్. ఇక విన్ని అయితే.. ఏకంగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు. సైరా సినిమాలో ఓ చిన్న సీన్ చేశాడు. కానీ ప్రభావం మాత్రం గట్టిగానే చూపించాడు. ఇక ఈ మధ్య నాని అంటే సుందరానికీ సినిమాతో పెద్ద రోల్ చేశాడు. అలా శేఖర్ మాస్టర్ తన పిల్లల అభిరుచుల్ని ప్రోత్సహిస్తుంటాడు. కొడుకు విన్ని, కూతురు సాహితీ ఇద్దరూ కూడా డ్యాన్సులు వేస్తుండటాన్ని శేఖర్ మాస్టర్ ఎంకరేజ్ చేస్తుంటాడు.

శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసే ఐకానిక్ స్టెప్పులన్నీ కూడా విన్ని, సాహితీ వేస్తుంటారు. ఇక ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో చేసే అల్లరి మామూలుగా ఉండదు. శేఖర్ స్టూడియో అంటూ పెట్టిన యూట్యూబ్ చానెల్‌లోనూ ఈ ఇద్దరూ సందడి చేస్తుంటారు. విన్ని, సాహితి చేసే వీడియోల్లో అప్పుడప్పుడు శేఖర్ మాస్టర్ కూడా వస్తుంటాడు. ఈ ముగ్గురూ కలిసి చేసే వీడియోలన్నీ కూడా వైరల్ అవుతుంటాయి. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించడంపై తన పిల్లల గురించి శేఖర్ మాస్టర్ ఎంతో గొప్పగా చెప్పేశాడు. వాళ్లకు ఏది ఇష్టమో అది చేయమని అంటాను..

Sekhar Master With Son Vinni And Daughter Sahithi kalavathi Steps

Sekhar Master With Son Vinni And Daughter Sahithi kalavathi Steps

వాళ్లకి ఇంట్రెస్ట్ ఉంటే సినిమాల్లోకి వస్తారు.. లేదంటే జాబ్స్ చేసుకుంటారు.. ఏదైనా సరే వాళ్ల ఇష్టమని చెబుతుంటాడు. ఇక తాజాగా కళావతి అంటూ స్టెప్పులు వేశాడు శేఖర్ మాస్టర్. అయితే అందులో కొత్త ఏమీ లేదని అనుకుంటున్నారా?.. ఈ సారి స్టెప్పులు వేసింది తన కొడుకు విన్ని, కూతురు సాహితితో కలిసి. అలా ఈ ముగ్గురు కలిసి వేసిన స్టెప్పులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Sekhar Master (@sekharmaster)

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది