Chandra Mohan : టాలీవుడ్‌లో విషాదం.. నటుడు చంద్రమోహన్ మృతి..!
ప్రధానాంశాలు:
Chandra Mohan : టాలీవుడ్‌లో విషాదం.. నటుడు చంద్రమోహన్ మృతి..!
హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చంద్రమోహన్ మృతి
Chandra Mohan : ప్రముఖ నటుడు చంద్రమోహన్ Chandra Mohan ఈరోజు ఉదయం 9:45 నిమిషాలకు మృతి చెందారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. కృష్ణాజిల్లా పమిడిముక్క లో జన్మించిన ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు Chandra Mohan . 1966 లో ‘ రంగులరాట్నం ‘ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ భాషలో కూడా సినిమాలు చేశారు. ఆయన నటనకు రెండు ఫిలింఫేర్ అవార్డులు, 6 నంది అవార్డులు వచ్చాయి. పదహారేళ్ళ వయసు, సిరిసిరిమువ్వ సినిమాలో అతడి నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి.ఆయన దాదాపు 932 చిత్రాలలో నటించాడు. కథనాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటాడు…
హీరోగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలు పోషించారు. కేవలం ఎమోషనల్ సీన్స్ మాత్రమే కాదు కామెడీని కూడా చంద్రమోహన్ పండించగలరు. చాలా సినిమాలలో ఆయన తన హాస్యంతో ప్రేక్షకులను నవ్వించారు. టాలీవుడ్ లో ప్రముఖ నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే ఇప్పటికే ఆయన సినిమాలలో చేస్తూ వచ్చారు. అయితే ఆయనకు వయసు పై పడటంతో అడపాదడపా సినిమాలలో నటిస్తూ వచ్చారు. అయితే తాజాగా ఆయన కన్నుమూసినట్లుగా తెలుస్తుంది.
82 ఏళ్ల వయసు కలిగిన చంద్రమోహన్ రావు కొన్ని అనారోగ్య సమస్యలతో అపోలో ఆసుపత్రికి చేరారు. అయితే ఆయన గుండె సంబంధిత సమస్యతో మరణించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈరోజు ఉదయం 9:45 నిమిషాలకు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. చంద్రమోహన్ మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. పలువురు సెలబ్రిటీలు ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక ఇండస్ట్రీలో ఈయనది లక్కీ హ్యాండ్ అని చెబుతుంటారు. ఈయనతో నటించిన శ్రీదేవి, జయసుధ, రాధికా, రాధ, విజయశాంతి వంటి ఎంతోమంది హీరోయిన్లు స్టార్లుగా మారారు.