Chandra Mohan : నటుడు చంద్రమోహన్ సినిమాలు, బెస్ట్ ఫ్రెండ్స్, కెరీర్ రికార్డులు ఇవే ..
Chandra Mohan : సీనియర్ నటుడు చంద్రమోహన్ ఈరోజు ఉదయం 9:45 గంటలకు మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చంద్రమోహన్ ఎన్నో సినిమాలు చేశారు. దాదాపుగా 975 సినిమాలలో నటించారు. 1945 మే 23న కృష్ణాజిల్లాలో చంద్రమోహన్ జన్మించారు. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర […]
ప్రధానాంశాలు:
Chandra Mohan : నటుడు చంద్రమోహన్ సినిమాలు, బెస్ట్ ఫ్రెండ్స్,
చంద్రమోహన్ కెరీర్ రికార్డులు ఇవే ..
చంద్రమోహన్ ఈరోజు ఉదయం 9:45 గంటలకు మృతి చెందారు
Chandra Mohan : సీనియర్ నటుడు చంద్రమోహన్ ఈరోజు ఉదయం 9:45 గంటలకు మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చంద్రమోహన్ ఎన్నో సినిమాలు చేశారు. దాదాపుగా 975 సినిమాలలో నటించారు. 1945 మే 23న కృష్ణాజిల్లాలో చంద్రమోహన్ జన్మించారు. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. ‘ రంగులరాట్నం ‘ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన హీరోగా 175 సినిమాలు చేశారు. 1987లో ‘ చందమామ రావే ‘ సినిమాకు సహాయ నటుడిగా అవార్డు అందుకున్నారు.
అలాగే ‘ పదహారేళ్ల వయసు ‘ సినిమాలో తన నటనకు ఫిలింఫేర్ అవార్డు దక్కింది. 2005లో ‘ అతనొక్కడే ‘ సినిమాలో నటనకు నంది అవార్డు సొంతం చేసుకున్నారు. అయితే చంద్రమోహన్ సినిమాలోకి రాకముందు క్యాషియర్ గా పని చేసేవారు. ఏలూరులో తన ఉద్యోగాన్ని కొనసాగించారు. సినిమాలపై ఆసక్తితో మద్రాసు వెళ్లిన ఆయన కెరియర్ ప్రారంభంలో చిన్నచిన్న పాత్రలు చేస్తూ తర్వాత హీరోగా మారారు. టాలీవుడ్ దివంగత స్టార్ హీరోలు అయినా సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు ఆయనకు అత్యంత సన్నిహితులు. అప్పట్లో శోభన్ బాబు ఏదైనా భూమి కొనాలి అంటే ముందుగా చంద్రమోహన్ 100 అడిగేవారట. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న సెంటిమెంట్.
అప్పట్లో ఇండస్ట్రీలో చంద్రమోహన్ ది లక్కీ హ్యాండ్ అని చెబుతుంటారు. ఈయనతో నటించిన శ్రీదేవి, జయసుధ, రాధిక, రాధ, విజయశాంతి లాంటి ఎంతో మంది హీరోయిన్లు స్టార్లుగా రాణించారు. ఆయనతో తొలిసారి గా నటించిన ఏ హీరోయిన్ అయినా తర్వాత తిరుగులేని స్టార్ హీరోయిన్ అయిపోతారన్న సెంటిమెంట్ ఉండేది. ఈ సెంటిమెంట్ ను నిజం చేస్తూ ఎంతో మంది హీరోయిన్ లు తిరుగులేని స్టార్ హీరోయిన్లు అయ్యారు. ఇక ప్రముఖ దర్శకుడు కె . విశ్వనాథ్ చంద్రమోహన్ కు కజిన్ అవుతారు. ఇక చంద్రమోహన్ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ భాషలో కూడా సినిమాలు చేశారు. ఆయన నటనకు రెండు ఫిలింఫేర్ అవార్డులుమ ఆరు నంది అవార్డులు వచ్చాయి. 16 ఏళ్ల వయసు, సిరిసిరిమువ్వ సినిమాలో అతడి నటనకు ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది.