Samantha : సమంత అదృష్టం మామూలుగా లేదు .. శాకుంతలం తరవాత ఏమైందో చూడండి !
Samantha : టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ‘ ఏ మాయ చేసావే ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆమె నటనతో మాయ చేసింది. ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. జెస్సి పేరుతో ఆ సినిమాలో ఆమె నటించిన తీరు అందర్నీ కట్టిపడేసింది. మరీ ముఖ్యంగా సమంతకు ఆ సినిమాతో యూత్ లో ఎక్కువ క్రేజ్ వచ్చింది. దీంతో ఆమెకు వరుసగా సినీ ఆఫర్లు వచ్చాయి. దీంతో అతి తక్కువ టైంలోనే సౌత్ లోనే నెంబర్ వన్ హీరోయిన్ గా సామ్ నిలిచింది. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది.
అయితే సమంతకి ముందు నుంచి అదృష్టం బాగా కలిసి వస్తుందట. తాజాగా సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరరావు సమంత గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయాలను బట్టి చూస్తే సమంతకు ఎంత అదృష్టం ఉందో అర్థమవుతుంది. అయితే సమంతకు తొలిసారిగా వచ్చిన సినీ ఆఫర్ ఏమాయ చేసావే కాదట. ఈ సినిమాకు ముందు సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరరావు సినిమాలో అవకాశం లభించింది. కానీ ఆమెకు రెమ్యునరేషన్ ఎక్కువ ఉండడంతో, తమ బడ్జెట్ కు సమంత సరిపోదని అందుకే సామ్ ను కాదనుకున్నారని ఆయన వెల్లడించారు.
దీంతో సమంతకు నిన్ను కలిశాక సినిమాలో ఆఫర్ రాలేదు. అయితే ఆమె ఆడిషన్లో అద్భుతంగా చేసిందని ఆయన వెల్లడించారు. ఆ సినిమాలో ఛాన్స్ మిస్ అయ్యాక సమంతకు ఏ మాయ చేసావే సినిమాలో ఆఫర్ వచ్చింది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఒకవేళ సమంత శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన నిన్ను కలిసాక సినిమాలో నటిస్తే ఇంత క్రేజ్ వచ్చేది కాదు. సమంతకు అదృష్టం ఉండబట్టే ఏ మాయ చేసావే సినిమాలో ఆఫర్ వచ్చింది. ఆ సినిమాతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.