Pushpa 3 Movie : బిగ్ బ్రేకింగ్.. పుష్ప ౩ గురించి నమ్మలేని అప్డేట్ !
Pushpa 3 Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘ పుష్ప ‘ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా పలు భాషలలో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. దీంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు పొందాడు. ఇక బాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికి ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో జనాలు పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటగా డైరెక్టర్ సుకుమార్ పుష్ప సినిమా కథను ఒక్క పార్ట్ గా తీయాలని అనుకున్నాడు.
కానీ కథ లెంత్ ఎక్కువగా ఉండడంతో రెండవ భాగం తీసేందుకు ప్లాన్ చేశాడు. అయితే తాజాగా పుష్ప సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ ఒకటి వచ్చింది. పుష్ప సినిమా మూడో భాగం కూడా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ సమాచారం ప్రకారం పుష్ప సినిమాకి మూడో భాగం కూడా ఉంటుందని అంటున్నారు. పుష్ప పాత్ర జనాలకు విపరీతంగా ఎక్కడంతో ఆ పాత్రను రెండో భాగంతో వదిలేయకూడదని, కథను మరి కాస్త పొడిగించి భవిష్యత్తులో మూడో భాగం కూడా తీయాలని సుకుమార్ ఆలోచిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ నుంచి సమాచారం బయటికి వచ్చింది.
ఏది ఏమైనా పుష్ప జోరు మామూలుగా లేదు అనిపిస్తోంది. రోజుకో వార్త పుష్ప సినిమా గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా పుష్ప మూడో భాగం ఉంటుందని వార్త రావడంతో జనాలలో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. పుష్ప మొదటి భాగాన్ని మించి రెండో భాగాన్ని సుకుమార్ సక్సెస్ఫుల్గా తీస్తాడా లేదా అనేది చూడాలి. పుష్ప మొదటి భాగం హిట్ అయినంతగా రెండో భాగం హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి. హిట్ అయితే మాత్రం అల్లు అర్జున్ సుకుమార్ పేర్లు పవన్ ఇండియా లెవెల్ లో మారూమ్రోగిపోవడం ఖాయం అని అల్లు అర్జున్ అభిమానులు భావిస్తున్నారు.