Venu Swamy : వచ్చే పదేళ్లలో జరిగేది ఇదే .. అల్లు అర్జున్ కెరీర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి ..!!
Venu Swamy : టాలీవుడ్ ఇండస్ట్రీలో గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యారు. అయితే అల్లు అర్జున్ కెరీర్ గురించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వేణు స్వామి ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అలాగే కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకుంటూ ఉంటారు.
అయితే తాజాగా అల్లు అర్జున్ గురించి చెప్పారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ జాతకం చూసినటువంటి వేణు స్వామి మాట్లాడుతూ .. జ్యోతిష్యం ప్రకారం అల్లు అర్జున్ జాతకం అద్భుతంగా ఉందని తెలియజేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఇదే స్టేటస్ ను వచ్చే పదేళ్లపాటు కొనసాగిస్తారని తెలిపారు. ఈయన జాతక ప్రకారం చూస్తే ఈయనపై ఎవరైనా నిర్మాతలు పది రూపాయలు పెట్టుబడి పెడితే వాళ్లకు వంద రూపాయల ఆదాయం ఉంటుందని తెలిపారు.
ఇక సినిమాల పరంగా అల్లు అర్జున్ ఎంతో మంచి సక్సెస్ సాధిస్తారని, అసలైన పాన్ ఇండియా స్టార్ అవుతారని ఈ సందర్భంగా అల్లు అర్జున్ కెరీర్ గురించి వేణు స్వామి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ గురించి వేణు స్వామి ఇలా పాజిటివ్గా మంచిగా మాట్లాడటంతో అల్లు అర్జున్ అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్లో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత బన్నీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.
https://youtu.be/sgiB5x1F_yc