Pushpa 3 Movie : పుష్ప‌3 డైలాగ్స్ లీక్.. ఇది ఫైర్ కాదు వైల్డ్ ఫైరుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pushpa 3 Movie : పుష్ప‌3 డైలాగ్స్ లీక్.. ఇది ఫైర్ కాదు వైల్డ్ ఫైరుగా..!

 Authored By ramu | The Telugu News | Updated on :19 December 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Pushpa 3 Movie : పుష్ప‌3 డైలాగ్స్ లీక్.. ఇది ఫైర్ కాదు వైల్డ్ ఫైరుగా..!

Pushpa 3 Movie : గ‌త కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా పుష్పరాజ్ ఫీవర్ కనిపిస్తోంది. డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసిన విష‌యం తెలిసిందే. భారీ మొత్తంలో వసూల్లు చేస్తూ.. కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. గతంలోని పాన్ ఇండియా రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డులను రాస్తుంది పుష్ప 2. ఊహించని విధంగా విజయాన్ని అందుకోవడంతో పుష్ప 3 కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. సినిమా ఎండింగ్ లో పుష్ప 3 కూడా ఉండబోతుంది అంటూ మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు దానికి సంబంధించిన ఒక డైలాగ్ కూడా సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది. మ‌రో రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత పుష్ప‌3 సెట్స్ మీద‌కి వెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం.

Pushpa 3 Movie పుష్ప‌3 డైలాగ్స్ లీక్ ఇది ఫైర్ కాదు వైల్డ్ ఫైరుగా

Pushpa 3 Movie : పుష్ప‌3 డైలాగ్స్ లీక్.. ఇది ఫైర్ కాదు వైల్డ్ ఫైరుగా..!

Pushpa 3 Movie పుష్ప‌3 ర‌చ్చ‌..

ఇప్పటివరకు కొంత పార్టీ షూట్ చేశారు అయితే ఇప్పటివరకు షూట్ చేసిన దాంట్లో ఒక డైలాగ్ అనేది చాలా బాగుందని ఆ సినిమా నుంచి కొంతమంది టెక్నీషియన్ల ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చింది పుష్పని చంపడానికి కొంతమంది బిహారీ రౌడీలు తన ఇంటి మీదికి వచ్చినప్పుడు పుష్ప వాళ్ళను కొట్టి ‘పుష్పని వేసేయ్యాలంటే ప్లాన్ ఒక్కటే ఉంటే సరిపోదబ్బా గుండెల్లో ధైర్యం కూడా ఉండాలి… ఎవడు పడితే వాడు వచ్చి పొడిస్తే పోవడానికి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా కాదు ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్’ అంటూ పుష్ప డైలాగ్ చెప్తాడట…ఈ డైలాగ్ విన్న ఫ్యాన్స్ పూన‌కాలు వ‌చ్చిన‌ట్టు ఊగిపోతున్నారు. పుష్ప‌3 మ‌రిన్ని రికార్డులు బ్రేక్ చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందాన జంటగా నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2. ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా విడుదలకు ముందే రూ. 1000 కోట్లకు పైగా బిజినెస్ చేసి గత సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. ఆరు రోజులలోనే రూ. 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం 1500 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతుంది. ఇలా ఎన్నో పాన్ ఇండియా సినిమాల రికార్డులను బ్రేక్ చేసి పుష్ప 2 ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది