Home » Entertainment » Serial Actor Siddharth Varma Special Post On Janaki Kalaganaledu Mallika
Entertainment

Janaki Kalaganaledu Mallika : ఫస్ట్ హగ్, ఫస్ట్ ప్రపోజల్.. గుర్తు చేసుకున్న జానకి కలగనలేదు ఫేమ్ మల్లిక భర్త

Authored By
aruna
The Telugu News | Published on: August 21, 2022, 1:20 pm
Advertisement

Janaki Kalaganaledu Mallika : బుల్లితెరపై ఆన్ స్క్రీన్ జంటలు.. రియల్ లైఫ్‌ల్లోనూ జంటలుగా మారుతుంటారు. ఎన్నో ఏళ్ల పాటు సీరియల్స్‌లో కలిసి నటిస్తుంటారు. అలా మొదలైన స్నేహం చివరకు ప్రేమగా మారుతుంటుంది. అలా కొంత మంది జంటలు పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవుతుంటారు. అలా నటి విష్ణుప్రియ, నటుడు సిద్దార్థ్ వర్మ ప్రేమ, పెళ్లితో ఒక్కటయ్యారు. ఇప్పుడు ఈ జంట మంచి ఫాంలో ఉంది. సిద్దార్థ్, విష్ణుప్రియలు తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

Advertisement

ఈ ఇద్దరి ప్రేమకు 9 ఏళ్లు అయ్యాయట. ఈ విషయాన్ని సిద్దార్థ్ చెప్పుకొచ్చాడు. నాటి రొమాంటిక్ పిక్‌ను షేర్ చేస్తూ తన శ్రీమతి మీద ప్రేమను కురిపించాడు. తొమ్మిదేళ్ల లవ్ అంటూ విష్ణుప్రియ బర్త్ డేకు స్పెషల్ పోస్ట్ వేశాడు. ఫస్ట్ హగ్, ఫస్ట్ ప్రపోజల్ అంటూ తన శ్రీమతి గురించి చెప్పుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సిద్దార్థ్ వేసిన పోస్టు మీద బుల్లితెర తారలు స్పందిస్తున్నారు. చైత్రా రాయ్ స్పందిస్తూ.. విష్ణుకి బర్త్ డే విషెస్ చెప్పింది. ఇక తన భర్త ప్రేమగా వేసిన పోస్ట్ మీద విష్ణుప్రియ స్పందించింది.

Serial Actor Siddharth Varma Special Post On Janaki Kalaganaledu Mallika

Advertisement

మూడు లవ్ హార్ట్ సింబల్‌లను కామెంట్లుగా పెట్టేసింది. మొత్తానికి ఇప్పుడు సిద్దు వేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. గతంలో ఆ ఇద్దరి ఫోటోలను చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పుడు విష్ణుప్రియ అయితే జానకి కలగనలేదు సీరియల్‌లో మల్లిక పాత్రతో ఆకట్టుకుంటోంది. ఇక యూట్యూబ్‌లో అయితే వెరైటీ వెరైటీ వీడియోలను చేస్తూ తన ఫాలోవర్లను ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. ఇక ఇప్పుడు ఇలా ఈ పోస్ట్‌తో మరోసారి ఈ జంట వైరల్ అవుతోంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి